
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండల కేంద్రంలోని సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో 891 వ మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫోరం అధ్యక్షులు చిగుళ్లపల్లి నర్సింలు అధ్యక్షత వహించి ఆయన మాట్లాడుతూ, మహాత్మా బసవేశ్వరుడు సమాజంలో కుల వ్యవస్థను వర్ణ వర్ణ భేదాలను లింగ వ్య వక్షతను సమూలంగా వ్యతిరేకిచ్చిన అభ్యుదయ వది అని అన్నారు.ఆయన సిద్ధాంతాలను మహాత్మా గాంధీ ఆచరించారని, ఆయన ప్రవచనాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బి. విజయ్ కుమార్,సి. వెంకటేశ్వర అప్ప,కే. శివ స్వామి,జి. పండరినాథ్,సి. వెంకటయ్య,రాజలింగం అయ్య, తదితరులు పాల్గొన్నారు.