
సిసి రోడ్లకు 40. లక్షలు మంజూరు చేసిన ఎమ్మెల్యే వివేక్
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామపంచాయతీలో సిసి రోడ్ల పునర్నిర్మాణం కొరకు చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి 40 లక్షల రూపాయల మంజూరు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తూ గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించుటకు కృషి చేస్తుందని అన్నారు. ముదిగుంట గ్రామానికి 35 లక్షలు రసూల్ పల్లి గ్రామానికి 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం బుధవారం చేపట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు పూర్తిగా చెడిపోయి గ్రామ ప్రజలు చాలా ఇబ్బందికి గురయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కొరకు చేస్తున్న కార్యక్రమాలకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.అలాగే ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కి గ్రామపంచాయతీ తరఫున ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.