
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న రెండవ రోజు ఆషాడ బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు
మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న మాట్లాడుతూ
మన తెలంగాణ రాష్ట్ర సంప్రదాయం మన సంస్కృతి మరువకుండా ఉండడానికి ఇలాంటి సంప్రదాయ సిద్ధమైన జాతరను అప్పటికి ఎప్పటికీ తీపి గుర్తు
మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఆషాడమాస బోనాల జాతర తొలి ఏకాదశి నుంచి విష్ణు భగవానుడు నిద్రించు సమయంలో ఆయన సోదరి సాక్షాత్తు ఆ మహాదేవి లోకాలను పాలిస్తుంది కావున ఆ తల్లికి అన్నము అనగా బోనం సమర్పించుకొనుటకు భక్తులు బోనాల జాతరను జరుపుకుంటారు అంతేకాకుండా స్త్రీని శక్తి స్వరూపిణిగా కొలుచుట మన సంప్రదాయంలో ఒక భాగo
కాబట్టి ఈ జాతరకు చాలా విశిష్టత ఉంది అని చెప్పారు