
Congress President Koyyada Srinivas
మహానాయకుడు రాజీవ్ గాంధీ
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్
జయంతి సందర్బంగా మొక్కలు నాటిన కాంగ్రెస్ శ్రేణులు
పరకాల నేటిధాత్రి
పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో వారి పేరు మీద మొక్కలు నాటారు.ఈ సందర్బంగా కొయ్యాడా శ్రీనివాస్ మాట్లాడారు దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహనీయుడు దేశం కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం విషయంలో యువకుల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి రాజీవ్ గాంధీఅని ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి విప్లవత్మకంగా మార్పులను తీసుకొచ్చారు తన హయాంలో టెక్నాలజీకి పెద్దపీట వేశారన్నారు.
టెలి కమ్యూనికేషన్స్ రక్షణ వాణిజ్య విమానా సంస్కరణాల ప్రవేశపెట్టారని విద్యా అవకాశాలు సమానత్వం కోసం నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారని అదేవిధంగా భారత దేశ యువకులకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు వినియోగించుకోవాలని యువతీ యువకులకు ప్రోత్సాహాన్ని ఇచ్చి దేశ రాజకీయాలలో విద్యారంగంలో ఉద్యోగ రంగంలో వ్యాపార వాణిజ్య రంగాలలో యువకులు ముందుండాలని వారి ఆలోచన విధానంతో ఈరోజు దేశ ప్రజలందరూ సెల్ఫోన్ ల్యాప్టాప్ ఐటీ రంగాన్ని ఉపయోగించుకుంటున్నారంటే యువత మొత్తం ఐటి రంగంలో ముందున్నారంటే అది రాజీవ్ గాంధీ యొక్క ఘనత అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి అన్నారు.అదేవిధంగా దేశం కోసం తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ప్రజలే నా ప్రాణం అంటూ ప్రజాసేవలో ముందుకు సాగి ప్రాణాలర్పించిన మహా నాయకుడు రాజీవ్ గాంధని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ అధ్యక్షులు బొచ్చు చందర్,బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్ల చిన్ని,సమన్వ కమిటీ సభ్యులు చిన్నల గోనాథ్,ఎండి రంజాన్ అలీ, పంచగిరి జయమ్మ,మడికొండ సంపత్,మెరుగు శ్రీశైలం గౌడ్,చందుపట్ల రాఘవరెడ్డి,సదానందం గౌడ్, మడికొండ శీను,వర్కింగ్ ప్రెసిడెంట్ మంద నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ ఒంటేరు శ్రవణ్ కుమార్,లక్కం వసంత,ఎండి కాయముదిన్,బొచ్చు భాస్కర్,దొమ్మటి బాబురావు,చిలువేరు రాఘవ,మహేందర్,బొచ్చు జెమిని,ఒంటేరు వరుణ్,వక్కేల్లి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
1వ వార్డులో ఘనంగా రాజీవ్ గాంధి జయంతి
పరకాల మున్సిపాలిటిలోని ఒకటవ వార్డు సీఎస్ఐ కాలనిలో రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి వారి చిత్ర పటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా మడికొండ సంపత్ కుమార్ మాట్లాడుతూ
దేశంలో ఐటీ రంగానికి పునాదులువేసి,భారీ విదేశీ
పెట్టుబడులను ఆకర్షించిన మార్గదర్శి,దివంగత ప్రధాని,
భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ కాంగ్రెస్ సమాన్వయ కమిటీ సభ్యులు నాయకులు డాక్టర్ మడికొండ శ్రీను,బొచ్చు భాస్కర్,యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిలువేరు రాఘవ,సదయ్య,మడికొండ రాజు,వినయ్,మహేష్
సిద్దు,కాంగ్రెస్ నాయకులు మహిళలు పాల్గొన్నారు.