మహాగర్జనను విజయవంతం చేయాలి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ వైఖరికి నిరసనగా మహాగర్జనను చేపట్టామని, మహాగర్జనను దళితులు విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు మంద రాజు కోరారు. శుక్రవారం కమలాపూర్ మండలకేంద్రంలో ఆయన మాట్లాడుతూ దళితులకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ వైఖరికి నిరసనగా ఈ మహాగర్జనను ఈనెల 8వ తేదీ బుధవారం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని డంపింగ్ యార్డులో వేసి ముఖ్యమంత్రి కేసిఆర్ దళితులను చిన్నచూపు చూశారన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలుస్తారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలు ఏకమై అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ కేసిఆర్ ప్రభుత్వానికి చరమగీతం పాడుతామన్నారు. ఈనెల 8న నిర్వహించే మహాగర్జనకు దళితులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నద్దునూరి కిరణ్, జిల్లా ఉపాధ్యక్షుడు చిలువేరు సంపత్‌కుమార్, అంబేద్కర్ జిల్లా కార్యదర్శి పుల్ల వినోద్, మండల గౌరవ అధ్యక్షుడు మంద రవీందర్, మండల ప్రధాన కార్యదర్శి రవీందర్, ఉపాధ్యక్షుడు రమేష్, జిల్లా కార్యదర్శి నద్దునూరి ప్రసాద్, సుధాకర్, ఓదేలు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.