
Magnesium Deficiency:
మెగ్నీషియం లోపంతో ప్రాణాలకే ముప్పు..! ఈ లక్షణాలు కనిపిస్తే బీ అలర్ట్..!
ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు ఇలా ప్రతిదీ అవసరమే. ఏ ఒక్కటి లోపించినా శరీర విధులకు ఆటంకం కలిగి అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా మెగ్నీషియం లోపం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ కింది సంకేతాల్లో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే చికిత్స తీసుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు కచ్చితంగా శరీరానికి అందాల్సిందే. విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు ఇలా ప్రతిదీ అవసరమే. ఏ ఒక్కటి లోపించినా శరీర విధులకు ఆటంకం కలిగి అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా మెగ్నీషియం లోపం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇది శరీరానికి అవసరమయ్యే ఖనిజాల్లో అత్యంత ప్రధానమైనది. ఏకంగా 300 విధుల్లో శరీరానికి తోడ్పడుతుంది. మన ఒంట్లో శక్తి ఉత్పత్తికి, పెరుగుదల సహా అనేక ఇతర క్రియలకు అత్యంత ముఖ్యమైనది.
కండరాల తిమ్మిరి
శరీరంలో మెగ్నీషియం తగ్గితే కనిపించే మొట్టమొదటి సంకేతం కండరాల తిమ్మిర్లు. కాళ్ళలో తరచుగా కండరాల తిమ్మిర్లు, నొప్పులు ఉంటే మెగ్నీషియం లోపించిందని అర్థం. కండరాల పనితీరులో మెగ్నీషియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది లోపిస్తే కండరాలు అసాధారణంగా సంకోచిస్తాయి. నరాల పనితీరు దెబ్బతింటుంది.
అలసట, బలహీనత
విశ్రాంతి తర్వాత కూడా అసాధారణంగా అలసిపోయినట్లు అనిపిస్తుంటే తక్కువ మెగ్నీషియం స్థాయిలకు సంకేతం కావచ్చు. ఈ ఖనిజం శక్తికి ముఖ్యమైనది. ఇది లోపిస్తే కణాల్లోని శక్తి తగ్గుతుంది. అందుకే అలసట, బలహీనత వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
క్రమరహిత హృదయ స్పందన
మెగ్నీషియం గుండె కండరాల పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీ హృదయ స్పందనను నిర్వహించడానికి సహాయపడుతుంది. మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు గుండె దడ, క్రమరహిత హృదయ స్పందనలు (అరిథ్మియా) లేదా ఛాతీ బిగుతుకు కారణమవుతుంది.
జలదరింపు
చేతులు, కాళ్ళు లేదా ముఖంలో జలదరింపు అనుభూతులు లేదా తిమ్మిరి మెగ్నీషియం లోపానికి సంకేతాలు. ఇలాంటివారిలో నరాల సరిగా పనిచేయవు. నరాల సాధారణ పనితీరుకు అంతరాయం కలుగుతుంది. ఎందుకంటే, మెగ్నీషియం నరాల సంకేతాలను నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
చాక్లెట్ లేదా ఉప్పు
మీకు తరచుగా చాక్లెట్ లేదా ఉప్పు తినాలనే కోరికలు కలుగుతుంటే ఒంట్లో తక్కువ మెగ్నీషియం ఉందని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా డార్క్ చాక్లెట్ ఖనిజాలకు గొప్ప మూలం. మెగ్నీషియం అసమతుల్యతను భర్తీ చేసుకునేందుకు మీ శరీరం ఉప్పు లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని కోరుకోవచ్చు.