మడిపల్లిలో మహాయజ్ఞం
మండలంలోని మడిపల్లి గ్రామంలో బొడ్రాయి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం బొడ్రాయి ఉత్సవాల చివరిరోజు కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు బొడ్రాయి వద్ద పూజలు చేసి మహాయజ్ఞం చేశారు. గ్రామస్తులంతా కలసివచ్చి గ్రామంలోని బొడ్రాయి వద్ద ప్రతిష్టించిన అమ్మవార్లకు కొత్తబట్టలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి తమతమ మొక్కులు తీర్చుకున్నారు. వేదపండితులతో ప్రతిఒక్కరు అమ్మవార్ల దీవెనెలు తీసుకున్నారు. గ్రామంలోని వారందరు చల్లగా ఉండాలని కోరుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో గ్రామస్తులందరూ పాల్గొన్నారు. అదేవిధంగా చుట్టుపక్కల గల గ్రామాల ప్రజలు కూడా మడిపల్లి గ్రామంలోని బొడ్రాయి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ బొడ్రాయి మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఆనందోత్సాహాలతో సాగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ చిర్ర సుమలత విజయ్, ఎంపిటిసి ఆకుల ఇంద్రయ్య, రైతు సమన్వయ అధ్యక్షుడు అంచూరి విజయ్‌కుమార్, వెలుదండి శ్రీరాములు, రమేష్, మాజీ ఎంపిటిసి రాజ్‌కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.