
ఎమ్మార్పీఎస్ మున్సిపాలిటీ ఇంచార్జ్ సరేష్…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మందకృష్ణ మాదిగ తలపెట్టిన ఎమ్మార్పీఎస్ 30 సంవత్సరాల పోరాట ఫలితంతో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో వర్గీకరణను స్వాగతిస్తూ దేశంలోనే ఏ రాస్ట్రం ఎస్సి వర్గీకరణ చేయకముందే తెలంగాణలో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పుతున్నారని, ఎమ్మార్పీఎస్ మందమర్రి మండలం ఇంచార్జ్ సారంగం, క్యాతనపల్లి ఇంచార్జ్ రాచర్ల సరేష్ లు అన్నారు. ఈనెల 27న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏబిసిడి వర్గీకరణ సదస్సు జన్నారంలో జరుగుతున్న నేపథ్యంలో మునిసిపాలిటీ పరిధిలోని మాదిగ, మాదిగ ఉపకులాలు సదస్సుకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ టౌన్ ప్రెసిడెంట్ పోచయ్య, మాజీ ఎంపిటిసి పుల్లూరు కళ్యాణ్, రాజేందర్, తిరుపతి, వెంకటేష్, కిరణ్, శ్రీనివాస్, గోపి, అఖిల్, సాయికుమార్,నరేష్, తదితరులు పాల్గొన్నారు.