Love Marriage Sparks Violent Attack in Jahirabad
ప్రేమ వివాహం నచ్చక దాడి
◆:- యువకుడి గుడిసెకు నిప్పంటించిన యువతి కుటుంబీకులు
◆:- కేసు నమోదు చేసిన పోలీసులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం(జహీరాబాద్),కూతురు ఇతర కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకో వడం నచ్చని ఆ యువతి తండ్రి, సోదరుడు కలిసి ప్రేమించి వ్యక్తి కుటుంబ సభ్యులపై దాడి చేయడమే కాకుండా వారి గుడి సెకు నిప్పుంటించారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కక్కరవాడ గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఝరా సంగం ఎస్ఐ పాటిల్ క్రాంతి కుమార్ తెలిపిన వివరాలివి..

కక్క రవాడ గ్రామానికి చెందిన గొల్ల విట్టల్ కుమార్తెను అదే గ్రామా నికి చెందిన బోయిని రాములు కుమారుడు రాధాకిషన్ ప్రేమించి పెద్దల ప్రమేయం లేకుండా వివాహం చేసుకున్నాడు. దీంతో ఆగ్రయించిన విట్టల్ ఆయన కుమారుడు పాండు కలిసి రాధా కిషన్ తండ్రి రాములు, బోయిని నగేశ్‌పై దాడి చేయ డంతో గాయాలయ్యాయి.

వీరు అంతటితో ఆగకుండా రాములకు చెందిన గుడిసెకు నిప్పు పెట్టడంతో వస్తువులు కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది సకా లంలో అక్కడి చేరుకొని మంటలను అదుపు చేశారు. బోయిని నగేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
