స్థానిక ఎన్నికలె గ్రామాభివృద్ధికి ద్వేయంగా మారుతాయి
నేటి ధాత్రి కథలాపూర్
గ్రామ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాల్సిన బాధ్యత ఇప్పుడు యువతపై ఉన్నది.
స్థానిక ఎన్నికలే గ్రామాభివృద్ధికి ద్వేయంగా మారుతాయి.
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని గ్రామంలో అభివృద్ధి చేసే నాయకున్ని ఎన్నుకోవాలని కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ (పౌర మరియు మానవ హక్కుల సంస్థ రాష్ట్ర కార్యదర్శి తాలూకా మల్లేష్ అన్నారు..
ఆయన మాట్లాడుతూ స్థానిక పాలనలో అభివృద్ధి లో ప్రజలు అసంతృప్తి చెందుతున్నారు నాయకులు ఒకసారి గెలిస్తే ప్రజల దగ్గరకు తిరిగి వెళ్ళరని ఆలోచన మారాలని ఆలోచన మారే విధంగా నూతనంగా ఎన్నుకోబడిన రాజకీయ నాయకుడు గ్రామ అభివృద్ధికి తోడ్పడి ఆ ఆలోచన రాకుండా చేయాలని అలాగే
ఊరికి మార్పు కావాలంటే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలి.
ఊరిలో మార్పు రావాలంటే మొదటగా మనం మారాలి గ్రామ సమస్యలపై అవగాహన ఉన్న వారిని, అలాగే విజన్, టెక్నాలజీ, వినియోగం ఇవన్నీ గ్రామ అభివృద్ధికి పనికొచ్చే అంశాలు నిజమైన సేవ భావనతో ముందుకు వచ్చినవారు గ్రామాన్ని సక్రమ దిశలో నడిపించగలరు గ్రామ సమస్యలు ఎత్తిచూపటమే కాదు వాటి పరిష్కారం చూపే దిశగా పనిచేయగల వ్యక్తిని ఎన్నుకోవాలి అలాగే ఓటర్లు కూడా డబ్బుకు మధ్యనికి లొంగకుండా కేవలం గ్రామ అభివృద్ధి మాత్రమే కోరుకోవాలని రాష్ట్ర కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ రాష్ట్ర
కర్యదర్శి తాలూకా మల్లేష్ అన్నారు.