
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన పాదం విజయ కనకయ్య దంపతుల కుమార్తె అపర్ణకు వెన్నుపూస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తక్షణం స్పందించి రెండు లక్షల యాభై వేల ఎల్ఓసిని అందజేశారు. ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మరవేని తిరుపతి ముదిరాజ్, ఒంటెల మురళి కృష్ణారెడ్డి, కోల రమేష్ , తడగొండ నర్సింగ్ బాబు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.