· ఖతార్‌లోని రాస్ లాఫన్ నగరంపై ఇరాన్ దాడులు
· ధ్వంసమైన ఎలఎన్జీ సంస్థ మౌలిక సదుపాయాలు
· మరమ్మతులకు మూడు నాలుగేళ్లు పట్టే అవకాశం
· ప్రత్యామ్నాయాలకోసం భారత్ యత్నాలు
· చమురుకు ఇబ్బందులు లేవు
· యుద్ధం ప్రభావం పడకుండా చర్యలు
హైదరాబాద్, నేటిధాత్రి:
రాస్ లాఫన్ పారిశ్రామిక నగరంపై ఈనెల 18న ఇరాన్ జరిపిన క్షిపణీ దాడులతో ఇక్కడినుంచిఎలఎన్జీ సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. ముఖ్యంగా ధ్వంసమైన ఎలఎన్జీ మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు దాదాపు 3`4 సంవత్సరాల కాలం పట్టనుండటంతో భారత్ లో తీవ్ర గ్యాస్ సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఏర్పడింది. దేశీయ అవసరాల్లో 40`47% వరకు గ్యాస్ అవసరాలు ఈ క్షేత్రం నుండి సరఫరాయ అయ్యే గ్యాస్తోటే తీరుతున్నాయి. ఇరాన్ క్షిపణిదాడి నేపథ్యంలో “ఫోర్స్ మజూర” నిబంధన యాక్టివేట్ కావడంతో మనదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఇక్కడ “ఫోర్స్ మజూర” అంటే “యాక్ట్ ఆఫ్ గాడ” లేదా కంపెనీకి సంబంధంలేని అనుకోని విపత్తు సంభవించినప్పుడు, గ్యాస్ సరఫరాను నిలిపేయవచ్చు. ఇ ప్పుడు ఇరాన్ క్షిపణి దాడిలో ఇది ధ్వంసం కావడంతో గ్యాస్ సరఫరాలు నిలిచిపోతే మనదేశం ఏమీ చేయలేని పరిస్థితి.
ప్రస్తుతం ఇరాన్ దాడుల వల్ల ఖతార్ గ్యాస్ ఎగుమతి సామర్థ్యం 17% తగ్గుతుంది. ఈ దాడిలో రెండు “ఎలఎన్జీ”ట్రైన్లు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఖతార్‌కు చెందిన “ఖతార్ ఎనర్జీ” మనదేశానికి చెందిన “పెట్రోనెట్ ఎలఎన్జీలు” ఫోర్స్ మజూర్ను ప్రకటించే అవకాశాలుండటంతో, చట్టబద్ధంగా మన దేశానికి చెందిన గెయిల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ సంస్థలకు గ్యాస్ సరఫరాలు తా త్కాలికంగా నిలిచి పోనున్నాయి. పోనీ ధ్వంసం కాని ఇతర “ట్రైన”లనుంచి గ్యాస్ తెచ్చుకుందా మనకున్నా, హార్ముజ్ జలసంధి మూసివేయడంతో అక్కడికి గ్యాస్ ట్యాంకర్లతో కూడిన ఓడలు వెళ్లడానికి వీల్లేదు. మనదేశీయ అవసరాల్లో 60% గ్యాస్ ఈ జలసంధినుంచే సరఫరా అవుతుంది.ప్రస్తుతం “దిశ”, “రాణి” వంటి గ్యాస్ ట్యాంకర్లు హార్ముజ్ జలసంధిని దాటి ఖతార్‌లోని లోడింగ్ పోర్టులను చేరే పరిస్థితి లేదు.
ఇక దేశీయంగా ఇప్పటికే పారిశ్రామిక వినియోగదార్లకు గ్యాస్ మార్కెటర్లు 10% నుంచి 40% వరకు గ్యాస్ సరఫరాలో కోత విధించారు. ప్రస్తుతం గహావసరాలకు, రవాణాకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పెరిగిన గ్యాస్ ధరలతో దేశంలో యూరియా ఉత్పత్తి ఖర్చు పెరగునున్నది. దీంతో రై తులకు సరఫరా అయ్యే యూరియా ఖర్చు కూడా పెరుగుతుంది. దీనివల్ల రిటైల్ ఖర్చులు పెరగకుండా చూసేందుకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ధరలు కూడా పెరుగుతాయి. ఇది దేశ ఆర్థికవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపగలదు.
ప్రపచంలోనే అతిపెద్ద పెట్రోల్ జీటీఎల్ (గ్యాస్ టు లూబ్రికెంట్స్) ఫెసిలిటీ దెబ్బతినడంతో బేస్ ఆయిల్స్ ఉత్పత్తిలో 50% కోత విధించడం తథ్యం. దీని ప్రత్యక్ష ప్రభావం బీఎస్`6 వాహనాల పై పడనుంది. క్యాస్ట్రోల్ ఇండియా, గల్ఫ్ ఆయిల్ వంటి సంస్థలపై ఈ ప్రభావం పడటమే ఇందుకు కారణం.
ప్రస్తుతం ఆసియన్ ఎలఎన్జీ స్పాట్ ధరలు రెట్టింపు అయ్యాయి. ఫలితంగా ఎంఎంబీటీయూకు 15 డాలర్లకు చేరుకుంది. ఇప్పుడు యు.ఎస్, ఆస్ట్రేలియాల్లో అందుబాటులో వున్న పరిమిత ప్ర త్యామ్నాయ కార్గోలకోసం మనదేశం యూరప్, తూర్పు ఆసియా దేశాలతో పోటీపడాల్సిన పరిసితి ఏర్పడింది. ప్రస్తుత మార్కెట్ అస్థిరతల నేపథ్యంలో పెట్రోనెట్ ఎలఎన్జీ, గెయిల్ సంస్థల షే ర్లు 7‘8% పడిపోయాయి. సరఫరాల రిస్క్‌లు అధికంగా వుండటం వల్ల మదుపర్లలో అయోమ యం ఏర్పడటమే ఇందుకు ప్రధాన కారణం. ప్రస్తుతానికి పెట్రోల్/డీజిల్ ధరలు స్థిరంగా వున్న ప్పటికీ దిగుమతి బిల్లులు తడిసి మోపెడవుతుండటంతో ప్రత్యామ్నాయ ఇంధన ధరలు కూడా పెరిగే అవకాశముంది. ఫలితంగా పారిశ్రామిక దవ్య్రోల్బణం ఏర్పడు ప్రమాదముంది.
ప్రభుత్వం ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, ధ్వంసమైన ఇంధనవనరులకు తక్షణం పరిష్కారమిచ్చేవిగా లేవు. ఏదైనా కొంత సమయం పడుతుంది. ఇది సంవత్సరాలు కూడా కావచ్చు. ఏదైనా అనుకోని విధ్వంసం వల్ల కలిగే నష్టాన్ని పూడ్చటం ఏ దేశ ప్రభుత్వానికైనా సాధ్యం కాదు. గ్రేటర్ ఇజ్రాయిల్ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో అమెరికా తీసుకొచ్చిన ఈ యుద్ధం ఇప్పటిదో ఆగే పరిస్థితి లేదు. ఇరాన్ వరుసగా దాడులు చేస్తున్న నేపథ్యంలో, ఇప్పటి వరకు మౌ నంగా పాటిస్తున్న గల్ఫ్ దేశాలు ఒకానొక దశలో సహనం కోల్పోయి ఇరాన్‌పై ఎదురుదాడికి దిగితే మధ్యప్రాచ్యం మొత్తం అల్లకల్లోలమై, ప్రపంచం మొత్తం కోలుకోలేని సంక్షోభంలోకి కూరుకుపోవడం ఖాయం.
ప్రస్తుత యుద్ధంలో ఇరాన్ గెలిచే అవకాశాలు ఎంతమాత్రం లేవు. కానీ ఇతర దేశాలను సర్వనాశనం చేసి మరీ తాను కూడా పూర్తిగా విధ్వంసమవుతుంది. ఇక్కడ ఇజ్రాయిల్ ప్రభావంతో అమెరికా యుద్ధంలోకి దిగిందా? లేక ఇరాన్‌ను నియంత్రించడానికి అమెరికా పోరాటం చేస్తున్నదా? అన్నది కాదు ప్రధానం. ఈ యుద్ధంతో సంబంధం లేని యావత్తు దేశాలు తీవ్ర సంక్షోభంలో మునిగిపోవడమే విషాదం. ఉక్రెయిన్‌కు సహాయం చేస్తూ గత ఐదేళ్లుగా తనను నానా ఇబ్బందు లకు గురిచేయాలని చూసిన పశ్చిమదేశాలే ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోవడం రష్యాకు ఆనందం కలిగిస్తుండవచ్చు. అదీకాకుండా ట్రంప్ తవ్విన గొయ్యిలో అమెరికాతోపాటు యూరప్ దేశాలు కూడా పడటమే కాకుండా, రష్యా ఆర్థికంగా మరింత పరిపుష్టం కావడం తాజా పరిణామం. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధ తీవ్రతను తగ్గిచడానికి యత్నాలు జరుగుతున్నా, పరిస్థితులు మాత్రం ఉద్రిక్తంగానే కొనసాగుతాయి. ఇరాన్ దారికొచ్చే వరకు కాల్పుల విరమణ సా ధ్యం కాదన్న ఉద్దేశంతోనే ట్రంప్ వుండటం గమనార్హం. హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయిల్ తన దాడులను కొనసాగిస్తోంది. ఇజ్రాయిల్, యుఎస్ ఆధీనంలోని 55 స్థావరాలపై శనివారం వర కు 77 దాడులు చేసినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించారు. యుద్ధం మొదలై 23 రోజులు గడిచినా ఇప్పటివరకు ఫలితం ఎటూ తేలలేదు.
ప్రస్తుతం దేశీయంగా ప్రత్యామ్నాయ ఇంధనం కోసం ప్రభుత్వం చేస్తున్న యత్నాలు ఫలించి అ నుభవంలోకి వచ్చేసరికి మరో ఐదేళ్ల కాలం పట్టవచ్చు. అది కూడా పూర్తిగా సాధ్యంకాదు.ఈ అనుకోని గడ్డు పరిస్థితిని కేంద్రం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.కాగా ప్రధాని నరేంద్రమోదీ కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఫ్రాన్స్, ఒమన్, జోర్డాన్ దేశాల నాయకులతో చర్చించి యుద్ధాన్ని నిలుపుచేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కూడా యుద్ధాన్ని తక్షణం నిలుపు చేయాలని పిలుపునిచ్చారు. అయితే ఈ యుద్ధం ద్వారా యుఎస్/ఇజ్రాయిల్ లక్ష్యాలు వేరు. ఇదే సమయంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మజ్తబా ఖమేనీ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. ఈ పరిస్థితిలో సంయమన సాధన ఎంతవరకు కుదురుతుం ది? యుద్ధం ముగించడంమే లక్ష్యమని యు.ఎస్. చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తి భిన్నంగా వున్నాయి. మొత్తంమీద చెప్పాలంటే ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.
ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్యలో భారత్ ఇరాన్‌కు అవసరమైన మందులతో కూడిన నౌకను పంపడం విశేషం. ఈ నౌక 18వ తేదీన ఇరాన్ చేరింది. సుమారు నాలుగువేలమంది ఇరాన్ పౌరులు మరణించినట్టు, ఎంతోమంది Å£ా తగాత్రులైనట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ దేశానికి వైద్య సహాయం నిమిత్తం ఔషధాలతో నౌకను పంపిన తొలి దేశం భారత్! ఈవిధంగా ప్రజల విషయంలో మానవతా దక్పథంతో వ్యవహరిస్తుంది కనుకనే భారత్ “విశ్వగురు” లేదా “విశ్వ హితుడి” స్థానాన్ని సంపాదించుకుంది. కాగా ఈ విధంగా సహాయం అందించినందుకు ఇరాన్ అధికారికంగా మనదేశానికి కతజ్ఞతలు తెలిపింది. కాగా మనదేశం పంపిన ఔషధాలను ఇరాన్‌లోని “రెడ్ క్రిసెంట” సంస్థ అందుకున్నది. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ చేసిన ఈ సహాయం కొన్ని వేల సంవత్సరాల చరిత్ర వున్న ఇరుదేశాల చారిత్రక, సాంస్కతిక సంబంధాలకు నిదర్శనమని ఇరాన్ అధికార్లు పేర్కొన్నారు. భారత ప్రజలకు ఈ సందర్భంగా వారు కతజ్ఞతలు తెలిపారు. ఇరాన్‌కు విరాళాలు అందించాలనుకునే భారతీయుల కోసం ఆ దేశ కాన్సులేట్ ప్రత్యేక బ్యాంక్ ఖాతా వివరాలు విడుదల చేసింది.
