మనిషి వెళ్తే ఎకరాకు రూ 1500
లేకుండా అయితే రూ.1000
వేములవాడ రూరల్ నేటి ధాత్రి
వేములవాడ రూరల్ మండలంలో
వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో వ్యవసాయ పనులు మొదలయ్యాయి దీంతో రైతులు భూమిని చదును చేసి ఇప్పటికే విత్తనాలు వేయగా మరికొందరు దుక్కులు దున్నుతూ విత్తడం కోసం సిద్ధం చేసుకునే పనుల్లో మునిగిపోయారు పంటల సాగులో యాంత్రికరణ పెరిగిన కొన్నిచోట్ల సాంప్రదాయ పద్ధతిలో విత్తనాలను నాగలి గుంటుకతోనే విత్తుతున్నారు దీంతో పశు పోషణ తగ్గిపోయి అరక కాడేడ్లకు గిరాకీ పెరిగింది గ్రామాల్లో అరక ఎడ్లను అద్దెకు ఇస్తున్నారు
అద్దెకు కాడెడ్లు
ప్రస్తుతం మార్కెట్లో ఏ వస్తువైనా రెడీమేడ్ గా లభిస్తుంది వ్యవసాయంలో రైతులకు కావలసిన విత్తనాలు ఎరువులు యంత్రాలు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి ఇప్పుడు అరకకు కోడెలు కూడా అద్దెకు లభిస్తున్నాయి ఆధునిక యంత్రాల రాకతో గ్రామాల్లో పశు పోషణ తగ్గిపోయింది గ్రామాల్లో ఎద్దుల పోషణకు అయ్యే ఖర్చు ప్రత్యేకంగా ఓ మనిషిని కేటాయించే పరిస్థితి లేక చాలామంది రైతులు కాడెడ్లు ను సాకడం మానేశారు ప్రస్తుతం పెద్ద రైతుల వద్ద మాత్రమే ఎద్దులు కనిపిస్తున్నాయి అయితే కొంతకాలంగా దుక్కులు దున్నడం వ్యవసాయ భూములు చదును చేయడం మొదలైన పనులు అన్ని ట్రాక్టర్లు సహాయంతో చేస్తూ ముందుకు సాగుతున్నారు అన్నదాతలు జిల్లాలో చాలావరకు రైతులు ప్రధానంగా పత్తి పండిస్తారు ఈ విత్తనాలను విత్తడం వరసలు చేయడం పంటల్లో కలుపు తీయడానికి గుంటుక కొడుతుంటారు వీటి కోసం అరక ఎద్దుల అవసరం తప్పనిసరిగా మారింది గ్రామాల్లో ప్రస్తుతం వందల సంఖ్యలో ట్రాక్టర్లు ఉంటే పదుల సంఖ్యలో మాత్రమే కాడెడ్లు ఉన్నాయి ఎద్దుల పోషణ భారంగా మారింది దీంతో చాలామంది కిరాయికి ఎద్దుల అరకను తీసుకొని వ్యవసాయం కొనసాగిస్తున్నారు దీంతో అరకు కాడేడ్లకు డిమాండ్ పెరిగింది కొందరు ఎద్దుల ఉన్న రైతులు వాటిని కిరాయికి ఇచ్చి వచ్చిన డబ్బుల ద్వారా వాటికి పోషణ ఖర్చులను వేల్లదీసుకుంటున్నారు
అరక కాడేడ్ల అద్దెతో జీవన ఉపాధి
గ్రామాల్లో కొందరు రైతులు రెండు మూడు జతల ఎడ్లు ఉన్న రైతులు వాటిని కిరాయికి ఇచ్చి జీవనం సాగిస్తున్నారు మరికొందరు తమకున్న కొద్దిపాటి వ్యవసాయాన్ని సాగు చేసుకుంటున్నారు మిగతా రోజుల్లో చిన్న సన్నకారు రైతులకి కిరాయికి ఇస్తూ వాటి పోషణ ఖర్చులు వెళ్లదీస్తున్నారు తనకున్న మూడు ఎకరాల్లో పత్తిని సాగు చేసి గ్రామంలో అరక సామాగ్రి తో పాటు ఎడ్లు మనిషి కిరాయికి వెళ్తే రోజుకు సుమారు రూ. 1500 వరకు కిరాయి లభిస్తుందని అంజయ్య అనే రైతు చెబుతున్నారు మనిషి లేకుండా అయితే రూ.1000 వరకు అద్దె చెల్లిస్తున్నారని తెలిపారు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది వానాకాలం పత్తి కంది యసంగి లో జొన్న పంటలను పండిస్తున్న రైతులు అద్దె కాడెడ్లు అరక సామాగ్రి కూలీలతో కాలం వెల్లదిస్తున్నారు ఖర్చులు కూడా కలిసి వస్తున్నట్లు అన్నదాతలు చెబుతున్నారు ఆటు అద్దెకు ఇచ్చే రైతులకు ఆదాయంతో పాటు పోషణ ఖర్చులు మిగులుతున్నాయంటున్నారు