‘లింగంబాబా’…ఐదుగురు దొంగలు
వరంగల్ అర్బన్ జిల్లా డిఐఈఓ కార్యాలయంలో క్యాంపు పేరిట భారీ మొత్తంలో అవినీతి జరిగిందన్నా ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో అవినీతి బాగోతాన్ని ‘నేటిధాత్రి’ కథనాల ద్వారా పాఠకులకు అందించిన అవినీతి డిఐఈఓ కార్యాలయంలో ఉద్యోగులు అవినీతి పాల్పడ్డారన్న కథనాల ఆధారంగా విద్యార్థి, ప్రజాసంఘాలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నాకు సిద్ధమవుతున్నట్లు విద్యార్థి, ప్రజాసంఘాల నేతలు తెలిపారు.
తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న దొంగలు
క్యాంపు పేరిట అక్రమంగా నొక్కేసి అవినీతికి పాల్పడిన ‘ఐదుగురు దొంగలు’ తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. క్యాంపు బాయ్స్ పేరిట 90మందికిపైగా పనిచేయకున్నా పనిచేసినట్లుగా పేర్లను సృష్టించి వారి అకౌంట్లలో దొడ్డిదారిన ప్రభుత్వ సొమ్మును వారి ఖాతాలో జమచేశారు. ఇవేకాకుండా స్టేషనరీ, ట్రావెల్స్, ఫ్లైయింగ్ స్వ్కాడ్స్, సిట్టింగ్ స్వ్కాడ్స్, పేపర్ వాల్యూవేషన్ చేసిన లెక్చరర్ల విషయంలో కూడా లెక్కకు మించి ఎక్కువ బిల్లులు పెట్టి అక్రమంగా నొక్కేశారు. ఈ విధంగా అవినీతికి పాల్పడిన ఆ ‘ఐదుగురు దొంగలు’ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కమిటీ వేస్తే దొరకడం ఖాయమంటున్న కొందరు
క్యాంపులో జరిగిన అవినీతి లీలలపై వస్తున్న ఆరోపణలపై ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఒకవేళ విచారణ కమిటీని నియమిస్తే అందరం దొరికిపోవడం ఖాయమని అవినీతికి పాల్పడిన ఉద్యోగులు ఒకరితో ఒకరు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
(అలీబాబా…’అస్త్రం’ త్వరలో)