లేతగా సమ్మగా..

ఎండల్లో హాయినిచ్చే ప్రకృతి ఫలం

లేలేత ముంజ నుంచి వచ్చే నీళ్లు యమ టేస్టీ

వడదెబ్బ నుంచి ఉపషమనం..

బరువు తగ్గిస్తుంది… మలబద్దకాన్ని నివారిస్తుంది

కొల్చారం, (మెదక్) నేటిధాత్రి :-

ప్రకృతి మనుషుల, కేసమేనా అన్నట్టు ఎన్నోరకాల నోరూరించే పండ్లను ప్రసాదించింది. ఈ ఫలాలను తినడం వల్ల వచ్చే ప్రతీ సమస్యకు విరుగుడునూ చూపిస్తుంది. ఓ వైపు భానుడు ఎర్రటి ఎండను ప్రసరిస్తూ చెమటలు కక్కించి నీరసపడిపోయేలా వేస్తున్నారు. దీంతో అనేక రకాల తో పాటు వడదెబ్బ ప్రతాపాన్ని కాల్సి వస్తోంది. సూర్యుడు వైపు మనిషిలోని నీటిని మెత్తం తాగినట్లు కొద్దిసేపు ఎండలో తిరిగితే నీరసం అవహిస్తుంది. అయితే దీని నుంచి బయట పడడానికి ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధా లాంటి పండ్లు ఎన్నో ఉన్నాయి. వీటిలో మనకు వేసవిలో గుర్తురు వచ్చేవి మూడు. పుచ్చకాయలు, తాటి ముంజలు, కొబ్బరి నీళ్లు ఇవి నీరసపడిన మనిషికి తక్షణ ఉపశ మనాన్ని ఇస్తాయి. వడదెబ్బ నుంచి రక్షి స్తాయి. సీజనల్గా వచ్చే తాటి ముంజలు గురించి తెలుసుకుందాం…
సమ్మర్లో మాత్రమే దొరికే కూలింగ్ ఫుడ్స్ లో తాటి ముంజలు కూడా ఒకటి. తాటి ముంజల్లో వుండే కొబ్బరి నీళ్ళ లాంటి తియ్యటి నీళ్ళు మీదు పడకుండా తినటం ఒక సరదా…. వేసవిలో ప్రత్యేకంగా లభించే తాటిముంజలు, పుచ్చకాయలు ప్రజలు భానుడి తాపాన్ని తట్టుకునేందుకు అత్యంత ప్రియంగా విటిని తించారు. అదేవిధంగా శీతాల పానియాలపై కూడా ఎక్కువ మోజు చూపుతారు.అందులో భాగంగానే వేసవి కాలంలో వచ్చే
తాటిముంజలకు భలే గిరాకీ ఉంటుంది.వేసవిలో విరివిగా లభించే వీటివల్ల కలిగే మేలు అంతా ఇంతా కాదు దాహార్తిని తగ్గించి. శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాదు.. అందానికి ఎంతో మేలుచేస్తాయివి. ఒకరకంగా చెప్పాలంటే దీన్ని ఐస్ ఆపిల్ అంటారు. ఈ ఐస్ ఆపిల్లో బోలెడు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇందులో విటమిన్ బి, ఐరన్, కాల్షియం వంటివి పుష్కలంగా ఉంటాయి. తాజాగా ఉండే ఈ తాటిముంజ జ్యూసీ లిచీ ఫ్రూట్ లా ఉంటుంది. రుచి తాజా లేలేత కొబ్బరి బోండాం టేస్ట్ కలిగి ఉంటుంది. కాలిన గాయాలకు, మచ్చలు, దద్దుర్లు వంటి సమస్యల్ని నివారించేందుకు తాటిముంజల్నీ తీసుకుని గుజ్జులా చేసి అందులో కొద్దిగా పాలపొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా రాసుకొని కాసేపయ్యాక కడిగేయాలి. ఇలా తరచు చేస్తుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. శాస్త్రవేత్త నిపుణులు చెప్తున్నారు. వీటితో పాటు మరికొన్ని ఆరోగ్యప్రయోజనాలల గురించి తెలుసుకుందాం…

వడదెబ్బ నుంచి ఉపశమనం

వేసవిలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ముంజలు ఎంతగానో ఉపయోగపడుతాయి. తాటి ముంజ మనిషికి ఎంతో మేలు చేస్తుంది. మనిషి శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గి జీర్ణక్రియ బాగా జరుగుతుంది. శరీరానికి మంచి చల్లదనాన్ని అందిస్తుంది. ఎండాకాలం ఈ తాటి ముంజల్లో నీళ్లు చాలా చలువ చేస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకి ముసలి వాళ్లకి చాలా మంచిది.

వేసవిలో మస్తు డిమాండ్

సీజనల్గా వచ్చే తాటి ముంజలకు
డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. గ్రామాల్లోవిరివిగా లభించే తాటి ముంజలు ఇప్పుడు పట్టణాల్లో కూడాదర్శనమిస్తున్నాయి.గ్రామాల నుంచి అనేక మంది గౌడన్నలు ఆటోల్లో తీసుకొచ్చి పట్టణాల్లో విక్రయిస్తుంటారు. దీంతో వారికి కొద్ది రోజులు ఉపాధి లభించడంతో పాటు పట్టణ వాసులకు అందుబాటులోకి తెచ్చినట్టవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!