ఉద్యోగాల భర్తీకై చక్రంలో సుత్తి గుర్తుని గెలిపించుకుందాం

ఐఎఫ్టియు నాయకుడు చంద్రగిరి శంకర్

భూపాలపల్లి నేటిధాత్రి

సింగరేణి పరిరక్షణకై ఉద్యోగ అవకాశాలకై ఈనెల 27న సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న ఎలక్షన్లలో బ్యాలెట్లో మొదటి గుర్తు అయిన చక్రంలో సుత్తి గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కార్మికులని కోరిన చంద్రగిరి శంకర్
గతంలో 1,70,000 మంది ఉద్యోగస్తులు ఉన్న సింగరేణి నేడు 39వేల మందితో నడుస్తుంది దీనికి కారణం నాటినుండి నేటి వరకు సింగరేణి శాసిస్తున్న గుర్తింపు సంఘాలు కాదా అని తెలంగాణ గోదావరిలో బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రగిరి శంకర్ ప్రశ్నించారు?
సింగరేణిలో ఇప్పటివరకు గుర్తింపు సంఘాలుగా ఉన్నవాళ్లు కొత్తగా ఇప్పుడు హామీలు గుప్పెడంలో అంతర్వేమిటో తెలియజేయాలని వారన్నారు గతం వరకు పరిపాలించిన వీరు ఉద్యోగాల గురించి ప్రమోషన్ల గురించి బోనస్ ల గురించి పట్టించుకోని వీరు ఇప్పుడు కొత్తగా హామీలు గుప్పించడంలో ముందుంటున్నారు.వారసత్వ ఉద్యోగాలు,డిపెండెడ్ ఉద్యోగాలు అన్ఫీట్ ఉద్యోగాలు గురించి ఇప్పటివరకు మాట్లాడని వేరు కొత్తగా ఎన్నికలలో మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఓ కార్మికులారా మీ పిల్లల భవిష్యత్తు కోసం సింగరేణి పరిరక్షణ కోసం సింగరేణి బతకాలి అంటే విప్లవ కార్మిక సంఘాలు గెలవాలి కావున కార్మికులందరూ చక్రంలో సుత్తి గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *