రాజపూర్ మండల అధ్యక్షులు. కావలి రామకృష్ణ..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
సోమవారం రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని గుండ్ల పొట్లపల్లి గ్రామంలో బూత్ 100లో పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. గ్రామంలో ప్రతి ఒక్క మహిళ యువకులు నాయకులు అందరూ డీకే అరుణమ్మ కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి పాలమూరు ఎంపీ గా నరేంద్ర మోడీ కి బహుమతిగా ఇస్తామని రాజపూర్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు తెలియజేయడం జరిగిందన్నారు. నరేంద్ర మోడీ పథకాలను గడపగడపకు తెలియజేస్తు ఆ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ రాజాపుర్ మండలం డీకే అరుణమ్మను కచ్చితంగా గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల ప్రబారి విజయన్న మహబూబ్ నగర్ పార్లమెంట్ ఇంచార్జ్ సామల నర్సింలు , జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు డబ్ల్యూ నరసింహులు , జిల్లా కార్యదర్శి అశోక్ మండల అధ్యక్షులు కావలి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఆనంద్ , సింగల్ విండో డైరెక్టర్ రాజు, సీనియర్ నాయకులు శేఖర్ గౌడ్, శక్తి కేంద్ర ఇంచార్జ్ బాల గౌడ్. ఆలే మధు, మండల ఉపాధ్యక్షులు అరుణ్ కుమార్, పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.