మహబూబ్ నగర్/ నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం ముసాపేట మండల కేంద్రంలో బిజెపి పార్టీ కార్యకర్తలకు సమావేశం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ సమక్షంలో చేరిన మాజీ సర్పంచ్ BRS సీనియర్ లీడర్ భాస్కర్ సమక్షంలో దాదాపు 100 మంది కార్యకర్తలు బిజెపి పార్టీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ టీకే అరుణ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు.
తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ మోసం చేసిందని మరోసారి బీఆర్ఎస్ కు ఓటేస్తే మోసపోతారన్నారు. రాష్ట్ర, కేంద్ర సర్కార్ ఉంటేనే అభివృద సాధ్యమన్నారు. ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదే అన్నారు.
రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకోసం, మన పిల్లల భవిష్యత్ కోసం బీజేపీని గెలిపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర నియోజకవర్గ బిజెపి పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.