
గణపురం నేటి ధాత్రి
గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రేపాక రాజేందర్ మాట్లాడుతూ ఈరోజు శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం మరియు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయడం కోసం తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది కావున కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు మహిళ నాయకులు మండల నాయకులు అన్ని గ్రామాల గ్రామ కమిటీ బూత్ కమిటీ అధ్యక్షులు యూత్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో తుక్కుగూడ జన జాతర సభకు తరలిరావాలని అని కోరారు