గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
కేంద్ర లో బిజెపి, ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంయుక్త కిషన్ మోర్ఛ (ఎస్ కేఏం) కార్మిక, విద్యార్థి తదితర సంఘాలు పిలుపులో శుక్రవారం జరిగిన దేశవ్యాప్త గ్రామీణ బందులో భాగంగాగుండాల మండల కేంద్రంలో ప్రదర్శన ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ (ఎంఎల్ )న్యూడెమోక్రసీ నాయకులు గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల సర్పంచ్ కొమరం సీతారాములు ప్రసంగిస్తూ మూడు నల్ల చట్టాల రద్దు లో భాగంగా జరిగిన ఆందోళనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని రైతులు పండించిన పంటకు ఎంఎస్ పి ప్రకారం కొనాలని, సంవత్సరం కాలం జరిగిన ఆందోళనలో రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, 44 చట్టాలను నాలుగు లేబర్ కొడ్లుగా విభజించడానికి వ్యతిరేకించాలని,
ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులపై బాసు వాయువు ప్రయోగించడాని, రైతులపై లాటి చార్జిని వ్యతిరేకించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు గడ్డం లాలయ్య, వై వెంకన్న, ఈసం కృష్ణ , ఎస్కె అస్గర్, ఉప సర్పంచ్ మానాల ఉపేందర్, సిపిఐ నాయకులు షాహిద్, పి వై ఎల్ జిల్లా కార్యదర్శి పర్శక రవి, ఐఎఫ్టియు నాయకులు గడ్డం నగేష్, చేబోతు రవి, బాల్య కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదాం
