గ్రామాల్లో గుడుంబాను నిర్మూలిద్దాం

మహబూబాబాద్ ను గుడుంబా రహిత జిల్లాగా రూపుదిద్దుదాం:- జిల్లా SP సుధీర్ IPS
శ్రద్ధగా చదువుకునే వారికి పోలీస్ సహకారం అన్నివేళలా ఉంటుంది

గంగారాం, నేటిధాత్రి :

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఐ.పి.ఎస్ గారి అధ్వర్యంలో గంగారం మండలంలోని జంగాలపల్లి గ్రామం లో కార్డన్ & సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు 50 మంది పోలీసులు జంగాలపల్లి గ్రామాన్ని చుట్టుముట్టి ప్రతి ఇంటిని అణువణువు తనిఖీ చేయడం జరిగింది. ఈ యొక్క తనిఖీలలో ఇద్దరిపై కేసుల నమోదు చేసి, దాదాపు 20 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని, 500 లీటర్ల పానకాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గారు మాట్లాడుతూ ప్రజలంతా గుడుంబా, గుట్కా, గాంజా వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. దీనివల్ల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోవడమే కాక మీ యొక్క మరియు మీ పిల్లల యొక్క భవిష్యత్తు అంధకారం అవుతుందని తెలిపినారు. గుడుంబా రహిత జిల్లాగా మహబూబాబాద్ ను తీర్చిదిద్దడంలో ప్రజలందరి భాగస్వామ్యం కచ్చితంగా ఉండాలన్నారు, దీనిలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమైనది అన్నారు. దీనికి గ్రామ పెద్ద మనుషులు భాగస్వాములు కావాలని రాజకీయ నాయకులు ముందుండాలని సూచిస్తూ అక్కడ గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించినారు,ఇక మీద గుడుంబా తయారీ, అమ్మకం దారులు తమ పద్ధతి మార్చుకోకపోతే పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జంగాలపల్లి యువతకు ప్రోత్సాహకరంగా మరియు వారికి ఆటల పట్ల శ్రద్ధ పెరిగేలా వాలీబాల్ కిట్టు బహుకరణ చేయడం జరిగినది యువత గ్రామంలో ఎవరైనా గుడుంబా తయారు చేసిన వారి పేర్లు రహస్యంగా పోలీస్ స్టేషన్కు చెప్పవచ్చును అట్టివారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు తెలియజేశారు.

పోనుగొండ్ల గ్రామంలో

అనంతరం పొనుగొండ్ల గ్రామంలో మొదటగా ప్రసిద్ధిగాంచిన శ్రీ పగిడిద్దరాజు దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. తర్వాత ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, నోట్ బుక్ లు మరియు యువతకు వాలీబాల్ కిట్ అందించడం జరిగింది. అనంతరం గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు విన్నవించిన సమస్యలను తమ పరిధిలో పరిష్కరిస్తూ, ఇతరత్రా సమస్యల పై సంబంధిత డిపార్ట్మెంట్ అధికారుల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మేడారం జాతరలో ముఖ్యమైన పగిడిద్దరాజు ఆలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఈ గ్రామాన్ని గుడుంబా రహిత గ్రామంగా చేయడంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని, యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి విద్యను అభ్యసించి సన్మార్గంలో నడవాలని చెప్పారు. నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు తగిన శిక్షణ తో పాటు మెటీరియల్ అందించేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృషి చేస్తామని యువతకు హామీ ఇవ్వడం జరిగింది. చివరిగా చిన్న పిల్లలతో బిస్కెట్లు చాక్లెట్లు పంచి ముచ్చటించి వారిని ఆనందింప చేయడం జరిగినది ఆ తర్వాత వారి తల్లిదండ్రులకు మంచి సూచనలు ఇచ్చి మీ పిల్లల్ని తప్పకుండా చదివించండి వారికి కావలసినటువంటి ఎంతటి సహకారానైనా మా పోలీస్ శాఖ అందిస్తుందని తెలియజేశారు.విద్యార్థులకు స్కూల్ బ్యాగులు నోట్ బుక్ లో అందించడం పట్ల గ్రామస్తులంతా ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలిపినారు. ఈ యొక్క కార్యక్రమంలో మహబూబాబాద్ డిఎస్పి తిరుపతిరావు, ఏ.ఆర్ డి.ఎస్.పి శ్రీనివాస్ , గూడూరు సిఐ బాబురావు, మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య , గంగారం ఎస్సై రవి కుమార్, కొత్తగూడ ఎస్సై దిలీప్, గూడూరు ఎస్సై నగేష్ లతో పాటుగా పలువురు ఆర్.ఐ లు, ఆర్.ఎస్.ఐ లు, గూడూరు సర్కిల్ మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!