Child Marriage Awareness Program in Chityala
బాల్యవివాహాలను నిర్మూలిద్దాం.
చిట్యాల, నేటి ధాత్రి :
జిల్లా కలెక్టర్ఆదేశానుసారం జిల్లా సంక్షేమాధికారి మల్లీశ్వరి మేడం సూచనల మేరకు మరియు ఐసిడిఎస్ సూపర్ వైజర్ జయప్రద మేడం ఆధ్వర్యంలో చిట్యాల మండలం మోడల్ స్కూల్లో శుక్రవారం రోజున బాల్య వివాహాల నిర్మూలన గురించి కళాజాత ఎర్రన్న బృందం తో కలిసి చైల్డ్ లైన్ కళావతి డీసీపీ యు సోషల్ కుమార్, డి హెచ్ ఈ డబ్ల్యూ మమత పిల్లలకు మరియు టీచర్స్ కి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలు, బాల కార్మికులు, బీటీ బచావో బీటీ పడావో, ఆడపిల్లల విద్యా ప్రాముఖ్యత రక్షణ, బాలల హక్కులు, సోషల్ మీడియా ప్రతికూలతలు, మహిళల సమస్యలపై అవగాహన కల్పించడం జరిగింది. మరియు మాదక ద్రవ్యాల నిర్మూలన గురించి, బాల్య వివాహాల నిర్మూలన పై అందరితో ప్రతిజ్ఞ చేయించి అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రవీందర్ గారు,ఉపాధ్యాయిని, ఉపాధ్యాయీలు, మరియు అంగన్వాడీ టీచర్స్ పాల్గొనడం జరిగింది.
