
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని తీర్మాలాపూర్ గ్రామంలో వున్న ప్రాథమిక పాఠశాలను సందర్శించిన జానపద గేయ రచయిత దాసారపు నరేష్ మాట్లాడుతు ప్రభుత్వ బడిలో చదువుకోని
నేడు ఎందరో ఉన్నత విద్యా వంతులుగా,ఉపాధ్యాయులుగా, పోలిసులుగా, జవానులుగా,రాజకీయ నాయకులుగా వివిధ హోదాల్లో స్థిరపడి కొలువులు చేస్తూ ఉన్నారు అందుకు కారణం సర్కారు బడి అని అన్నారు, నేటి విద్య వ్యవస్థ కుడా ఒక వ్యాపారం అయిపోయింది కాబట్టి అందుకు ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించకూడదని ఇప్పుడు సర్కారు బడులు కూడా కార్పొరేట్ పాఠశాలలుకు దీటుగా పోటి పడి ఇంగ్లీష్ మీడియం బోదన కూడా చెప్పడం జరుగుతుందని మన సర్కారు బడిని కాపాడే బాధ్యత ఊరి ప్రజలందరిదని రాబోయే తరాలకు కూడ ఈ సర్కారు బడి గొప్పతనం చెప్పాలని లేకుంటే మనమే బాధపడే రోజు వస్తుందని అన్నారు, ఈ కార్యక్రమలో పా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. నాగరాజు, బడి పిల్లలు స్వేచ్ఛ శృతి,ప్రకృతి ,అగ్ని, రనీష్, శాలిని,జి నిశాంత్, శరణ్య, ఎక్స్టినా తదితరులు పాల్గొన్నారు.