డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారముగా మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞను గ్రామస్తులు, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాఠశాల ఆవరణలో చేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని,డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచరాజు కుమార్,పుల్లూరి రామకృష్ణ, అంగన్వాడీ టీచర్ భీముడి లక్ష్మి,గ్రామస్తులు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
