డ్రగ్స్, గంజాయి , మాదకద్రవ్యాలపై అవగాహన
నిజాంపేట: నేటి ధాత్రి
డ్రగ్స్, గంజాయి, మాదకద్రవ్యాలపై విద్యార్థులకు మంగళవారం స్థానిక ఎస్సై రాజేష్ అవగాహన కల్పించారు. నిజాంపేట మండలం నందిగామ గ్రామంలో పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్, గంజాయి, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు మత్తు పానీయాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. అలాగే ఆధునిక పరిజ్ఞానం పెరిగిన కొలది సైబర్ నేరగాళ్లు విచిత్ర రూపంలో ప్రజలను మోసం చేస్తున్నారని సైబర్ నేరగాళ్ల పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు.
