
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్
రామడుగు, నేటిధాత్రి:
ఇరవై తోమ్మిది కార్మిక చట్టాల పునరుద్ధరణకై కార్మిక చట్టాల పరిరక్షణకై చికాగో అమరుల పోరాట స్ఫూర్తితో బిజెపిని ఓడించి , దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజలను రక్షించుకుందాం అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్ అన్నారు. మే డే కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి, లక్ష్మీపూర్, రామడుగు, గోపాలరావుపేట తదితర గ్రామాలలో ఎర్ర జెండాలు ఎగురవేశారు. ఈసందర్భంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ బిజెెపి ప్రభుత్వ పాలనలో దేశాభివృధ్ది వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందని, కుల, మత విద్వేశాలు పెచ్చూరిల్లాయని, మైనారిటీలు, దళితులపై అమానుష దాడులు పెరిగాయని, దేశంలో దారిద్యం తాండవిస్తోందనీ, సోదరభావం
దెబ్బ తింటోందని, ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు జైల్లో పెట్టి వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరియు దేశ సార్వభౌమాధికారాన్ని సామ్రాజ్యవాద దేశాలకు మోడీ తాకట్టు పెడుతున్నాడని, దేశ సమగ్రత, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాలను అపహాస్యం
చేస్తున్నాడని, బిజెపి వ్యతిరేకులను దేశ ద్రోహులుగా చిత్రిస్తూ వారిపై దేశ ద్రోహ కేసులు బనాయించి వేధిస్తున్నారని, విదేశాలలో ఉన్న నల్లదనం తీసుకువచ్చి ప్రతి భారతీయుడికి పదిహేను లక్షలు పంచుతానన్న మోడీ మాటలు నీటి మాటలుగా మిగిలిపోయాయని దుయ్యబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో బడా పెట్టుబడిదారులకు కారు చౌకగా మోడీ అమ్మి వేస్తునాడని, రుణమాఫీ పేరుతో ప్రజా ధనాన్ని దోపిడీదారులైన పెట్టుబడిదారులకు దారా దత్తం చేసి దేశ ప్రజలను పేదవారిగా మార్చివేస్తున్నాడని,
కేంద్రంలోని బిజెపి-మోడీ ప్రభుత్వం దేశాభివృధ్ధిని, దేశ సమగ్రతను నాశనం చేస్తోందన్నారు. ఆరోజు కార్మిక లోకం అమెరికా నగరం ”’హే”’ మార్కెట్లో 1886మే1న సమ్మె చేయాలని నిర్ణయించిన ప్రపంచ కార్మిక సంఘాలు మార్కెట్లో జరిపిన నిరసన ప్రదర్శనల సందర్భంగా ఎనిమిది గంటల పని దినాల కోసం కదం తొక్కిన కార్మికులపై పెట్టుబడి దారులు, వారి గుండాలు, ఆర్మి పోలీసులు జరిపిన దాడిలో తుపాకి తూటాకు చనిపోయిన వారి రక్తంతో తడిపి ఎగిరేసిన జెండాతో మే అమెరికా ప్రభుత్వం దిగివచ్చి ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేసిన రోజే మే డే గా చికాగో అమరవీరుల మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, భారతదేశంలో పెట్టుబడిదారుల పాలనను అంతం చేసి, ఎర్రకోటపై ఎర్రజెండను ఎగరవేయటమే కార్మిక వర్గం యొక్క ప్రధాన కర్తవ్యంగా, ప్రస్తుత పరిస్థితుల్లో కార్మిక శ్రేయస్సు కోసం హక్కుల సాధన కోసం, చట్టాలను పరిరక్షణ కోసం, పెట్టుబడి దారి విధానాలకు వ్యతిరేకంగా, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటలు కొనసాగించాలని సృజన్ కుమార్ పిలుపు నిచ్చారు. ఈకార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి గోడిశేల తిరుపతి గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు మచ్చ రమేష్, నాయకులు ఉమ్మెంతుల రవీందర్ రెడ్డి, నాంపెల్లి, శంకరయ్య, మ్యాక స్వామి, నర్సయ్య, మల్లయ్య, శ్రీనివాస్, రాజయ్య, కనుకయ్య గంగవ్వ, రాజవ్వ, దుర్గవ్వ తదితరులు పాల్గొన్నారు.