# కాలం చెల్లిన సిద్ధాంతాల కోసం ప్రాణాలు కోల్పోవద్దు
# జనజీవన స్రవంతిలో కలవండి మీ కుటుంబ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి
# లొంగిపోయిన మావోయిస్ట్స్ ల ఉపాధి మా భాద్యత*
జిల్లా ఎస్పి డా. శబరిష్ ఐపిఎస్
ములుగు జిల్లా నేటిధాత్రి
ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నిషేదిత సిపిఐ మావోయిస్టు పార్టీలో పని చేయుచున్న అజ్ఞాత మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి పోలీస్ ఎదట లొంగిపోవాలని ములుగు పోలీస్ వారి విజ్ఞప్తి. నిషేధిత సిపిఐ మావోయిస్టు సిద్ధాంతాలు కాలం చెల్లినవని వారి భావజాలం ప్రజల్లో ప్రాముఖ్యం కోల్పోయిందని మావోయిస్టు సిద్ధాంతాలను ప్రజలు నమ్మడం లేదు. కొంతమంది అగ్ర నాయకులు కాలం చెల్లిన సిద్ధాంతాలతో సామాన్య ప్రజల జీవితానికి విఘాతం కల్పిస్తూ ఇన్ఫార్మర్ నేపంతో అమాయకపు ఆదివాసులను చంపుతూ, మందు పాతరాలు పేల్చుతూ, తెలంగాణ మరియు చతిస్గడ్ సరిహద్దుల్లో అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తునారు తుపాకీ గొట్టం ద్వారా రాజాధికారం సాదించవచ్చు అనే అపోహ వదిలి తెలంగాణ ప్రభుత్వం ఎదుట లోoగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రులకు మరియు కుటుంబ సభ్యుల యొక్క బాధ్యత నేరవేర్చే వ్యక్తిగా ఉండాలని, ములుగు జిల్లా పోలీస్ వారు కోరుచున్నారు. ములుగు జిల్లా నుండి అజ్ఞాతంలో సిపిఐ మావోయిస్టు పార్టీలో పనిచేయుచున్న నాయకులు మరియు సభ్యులు ములుగు జిల్లా పోలీస్ ఎదుట లొంగిపోవాలి. లొంగిపోయిన వారికి వారి పేరు మీద ఉన్న నగదు రివార్డును మరియు జీవనోపాధి కోసం వారికి పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం ద్వారా కృషిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేయు చున్నాము సంప్రదించవలసిన నెంబర్లు ఎస్పి ములుగు 8712670100 ఓఎస్డి ములుగు 8712670101ఏఎస్పి ఏటూరునాగారం 8712670104 డి ఎస్ పి ములుగు 8712670103 ఎటువంటి భయాలకు లోను కావద్దు ధైర్యంగా లొంగిపోండి మీ సంరక్షణ – సంక్షేమం మా బాధ్యత. మీ కుటుంబంతో హాయిగా జీవించండి డా. శబరిష్ పి ఐపిఎస్
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్