వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పురపాలక సంగం సూచనల మేరకు భక్తులకు, ప్రజలకు దాహార్తి తీర్చడానికి వేములవాడ రాజన్న గుడి ముందు మన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని మన చారిటబుల్ ట్రస్ట్ సబ్యుల సహకారంతో సోమవారం రోజు ప్రారంభించడం జరిగినది.
మండుతున్న ఎండల్లో ప్రజలకు గుడి దర్శనానికి వచ్చిన భక్తులకు గొంతు తడుకోవాలంటే పలు దిక్కులు చూడాల్సిన అవసరం లేకుండా గుడి ముందు భాగంలో దాహం తీర్చుకోవడానికి భక్తులకు, ప్రజలకు సౌకర్యార్థం మన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ట్రస్ట్ సభ్యుల చేతుల మీదుగా ఏర్పాటు చేయడం జరిగినది.
ఆకలివేస్తే అన్నము. దహము వేస్తే నీరు. ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకోవడం. చదువుకునే వారికి స్థోమత లేక పోతే చదివించడం ఇలాంటి సేవలు చేయడం మన చారిటబుల్ ట్రస్ట్ స్వంతం అని ప్రజలు కొనియాడుతున్నారు.
ఇట్టి కార్యక్రమంలో మన చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.