రేవంత్ చెప్పినప్పుడు లెక్క 2000 కోట్లు.. నేడు మార్కెట్ లెక్క 3000 కోట్లు.!
ఆనాడు లేఅవుట్ రద్దు చేయాలని భూ ఆక్రమణ పై పోరాడిన పిసిసి చీఫ్ “రేవంత్”
నేడు చక చకా నడుస్తున్న లేఅవుట్ పనులు
లేఅవుట్ “పర్మిషన్ కావాలా నాయనా”.?
చీఫ్ సెక్రటరీ కి లేఅవుట్ పర్మిషన్ కి అప్లై చేసుకుంటే కండిషన్లతో పర్మిషన్ ఇచ్చేశాడు.
మున్సిపాలిటీ దాకా వద్దు చీఫ్ సెక్రటరీయే ముద్దు.
గత ప్రభుత్వంలో జరిగిన “భూ దందా”.
3000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని రక్షించాల్సిన వాడే భక్షించేశాడు.
కాసు ముందు కరిగిపోయాడు MEMO – 976 జారీ చేశాడు
స్మశాన వాటికనూ ఆక్రమించారు.
నిన్నటి ఏలికలో “కీలక నేత” ఆదేశాలతో భూమి వశం చేసుకున్నారు.
రాత్రికి రాత్రే రికార్డులు తారుమారు చేశారు!
ప్రభుత్వ భూమిని ప్రైవేటు పరం చేసి “వెంచర్ చేశారు”.
“బస్తీదవఖాన” కోసమొచ్చి “భూ దందా” మొదలుపెట్టారు.
పిసిసి ప్రెసిడెంట్‌గా నాడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
సిఎం.గా “రేవంత్ రెడ్డి” ఏం చర్యలు తీసుకుంటారా! అని ఎదురుచూస్తున్నారు.
“రేవంత్” బుల్డోజర్ కోసం ఎదురుచూస్తున్న “షేక్ పెట్” ప్రజలు.!
వేసిన కేసుకు 20 రోజుల ముందే ఆర్డర్ తెచ్చుకున్న సీఎస్.!
“సోమేశ్ కుమార్” కంటే ఒక అడుగు ముందుకేసిన “లోకేష్ కుమార్”
మీ “నేటిధాత్రి”లో త్వరలో ఎక్స్ క్లూజివ్