భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ బ్రహ్మోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు..
ఈనెల 19 నుండి 27 వరకు సుమారు వారం రోజులు పాటు జరిగే ఈ జాతరకు 5లక్షలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తీ చేశామని ఆలయ ఈవో బిల్లా కంటి శ్రీనివాస్ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ ముల్కనూరి బిక్షపతి తెలిపారు
కొడవటంచ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సుమారు 900 సంవత్సరాల క్రితం మందాత అనే మహారాజు కాలంలో ఒక పెద్ద బండ రాయిపై లక్ష్మీ నరసింహ స్వామి వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి అని
అప్పటి నుండి మానసిక రోగులు దేవాలయ ప్రాంగణం లో నిద్రిస్తే మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతారని కాబట్టి చుట్టూ పక్కల ప్రాంతాలలో పాటు ఇతర జిల్లాల నుండి కూడా మానసిక రోగులు ,శారీరక రుగ్మతలు కలిగిన వారు కుటుంబ సమేతంగా వచ్చి శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారం రోజుల పాటు దేవాలయ ప్రాంగణం లో నిద్రిస్తరని
ప్రతీ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ దశమి నుండి ఫాల్గుణ బహుళ విదియ వరకు వారం రోజుల పాటు శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అని ఆలయ పూజారి శ్రీనివాస చార్యులు తెలిపారు.
ఈ నెల19 నుండి 27 వరకు నిర్వహించే
కొడవటంచ
లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
పరకాల ,భూపాలపల్లి ఆర్టీసీ డిపోల నుండి ప్రత్యేక బస్సులు జాతర సమయంలో నడుస్తాయని, పారిశుధ్యం, విద్యుత్తు, మంచినీరు లాంటి అన్ని మౌలిక వసతులు జాతర వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది స్వామీ వారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం చలువ పందిళ్ళు, ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ ఈ.వో శ్రీనివాస్ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ ముల్కనూరీ బిక్షపతి తెలిపారు.