సన్మానించిన స్థానిక కార్పొరేటర్.
కాశిబుగ్గ నేటిధాత్రి
వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ పరిధి కీర్తి నగర్ కు చెందిన లక్ష్మి ప్రియ ఇటీవల విడుదలైన ఫలితాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్ జి టి)పోస్ట్ సాధించడం జరిగింది. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ సుంకరి మనిషా శివకుమార్ లక్ష్మీ ప్రియను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్మీ ప్రియ కు టీచర్ పోస్ట్ రావటం కార్పొరేటర్ సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కీర్తినగర్ కాలనీ బి ఆర్ యస్ పార్టీ గ్రామ నాయకులు పాల్గొన్నారు.