#నెక్కొండ, నేటిధాత్రి:
మండలంలోని గౌతమి విద్యానికేతన్ హైస్కూల్లో మంగళవారం గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ అనంతుల మురళీధర్ విశాలాక్ష్మి దంపతులు, ప్రిన్సిపల్ కల్పన , దొడ్డ వెంకటేశ్వర్లు, హైమావతి దంపతులు హోమంలో పాల్గొన్నారు. వేద పండితులు హరిశంకర శర్మ, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అర్చకులు బివియన్ శాస్త్రి, జ్యోతిష వేద పండితులు శ్రవన్ శాస్త్రి ల వేద మంత్రోచ్ఛారణల నడుమ పూజ హోమాది క్రతువు సాగింది. శ్రీ సూక్త, పురుష సూక్త విధానంలో ఆవాహిత దేవతల మంటపారాధన తో పాటు విశేష హోమాలు జరిపి పూర్ణాహుతి చేశారు. కార్యక్రమంలో మహిళా సంఘం ప్రతినిధులు గిరగాని హేమలత గన్ను పద్మలత, తాటిపల్లి సురేఖ ,గన్ను శివరంజని, దొడ్డ కవిత గుమ్మడవల్లి స్వరూప ,భూపతి రాణి, ఉమ పాల్గొన్నారు