రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో ఓప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం వ్యర్థ పదార్థాలను నిబంధనల ప్రకారం ఆసుపత్రి ఆవరణలోని చెత్తకుండీలలో వేయాలి. నిబంధనలను తుంగలో తొక్కి ఆసుపత్రి బయట నీడిల్స్ తో పాటు వ్యర్ధపదార్థాలను చెత్తబుట్టలో కాకుండా బహిరంగంగా పడవేశారు. ఇలా బహిరంగంగా పడవేయడం దాని పక్కన గల టిదుకాణానికి వచ్చే వ్యక్తులు పలు రకాలుగా మాట్లాడుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైనది. ఆసుపత్రి పర్యవేక్షణ లోపంతో వ్యర్థ పదార్థాల సంబంధిత విడిభాగాలు పక్కన ఉన్న సూపర్ మార్కెట్ ముందు స్థలం వరకు వ్యర్థ పదార్థాలు రోడ్డుపైనే కనిపించడం గమనార్హం. ఆసుపత్రి నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న ప్రభుత్వ వైద్యాధికారుల బృందం చూసి చూడనట్లు వ్యవహరించడంపై ప్రజలు మండిపడుతున్నారు. మండల వైద్యాధికారులు ఆస్పత్రుల పర్యవేక్షణ క్రమం తప్పకుండా చేయాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ పట్టనట్లు ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ఆసుపత్రులతో కుమ్మక్కై పర్యవేక్షణ తూతు మంత్రంగా కొనసాగిస్తున్నారని విమర్శలు ప్రజలలో వెలువెత్తుతున్నాయి. మరి ఇప్పటికైనా జిల్లా ఉన్నత వైద్యాధికారి ఈఘటనపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత ఆసుపత్రి పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.