కుంభకర్ణుడు అనగానే మనకి గుర్తొచ్చేది గాఢమైన నిద్ర. ఏంట్రా కుంభకర్ణుడిలా తినేసి పడుకున్నావ్.. అనే మాట చాలా సింపుల్ వాడేస్తుంటాం. అపలెందుకు కుంభకర్ణుడు అంతలా నిద్రపోతాడు..? అంత తిండి ఒక్కడే ఎందుకు తింటాడు.? ఎలా తినగలడు.? అనే విషయాలపై ఎప్పుడూ ఆసక్తి పెట్టి ఉండము. ఏదో పురాణాల్లో చెప్పారు.. కుంభకర్ణుడు ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటాడట. లేపితే, ఆయనకు చాలా కోపమొచ్చేస్తుందట. పెద్ద పెద్ద పళ్లాలతో ఆహారాన్ని భుజిస్తాడట.. గునపాలు.. గొళ్లాలతో పొడిచినా నిద్ర లేవనే లేవడట… అని తెలుసు. చాలా సినిమాల్లోనూ ఈ తరహా క్యారెక్టర్ని అదే విధంగా చిత్రీకరించారు కూడా. అయితే, కుంభకర్ణుడి ఆ నిరంతర నిద్రకి కారణాలేంటో.? అసలు కుంభకర్ణుడు ఎవరు.? ఎందుకు అంత నిద్ర పోతాడు.? అనే విషయాల్ని ఇప్పుడు చూద్దాం.
లంకాధి పతి అయిన రావణాసురుడు సోదరుల్లో ఒకడు కుంభకర్ణుడు. రావణాసురుడి సోదరులు ముగ్గురు. వారిలో రావణాసురుడు పెద్దవాడు కాగా, రెండో వాడు విభీషణుడు, మూడో వాడే కుంభకర్ణుడు. ఈ ముగ్గురూ ఒకరోజు. బ్రహ్మదేవుని ప్రసన్నం కోసం భయంకరమైన తపస్సు చేశారు. వారి భక్తికి మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఏం వరం కావాలో కోరుకొమ్మన్నారు.
రావణాసురుడు అమరత్వం కోరుకున్నాడు.. పక్షులు, పాములు, యక్షులు తదితర వారి నుండి నీకు మరణం సంభవించదు.. అని రావణాసురుడికి వరం ఇచ్చాడు. విభీషణుడు తన జీవితాంతం, నీతి, నిజాయితీ, న్యాయానికి కట్టుబడి ఉండేలా వరం ఇవ్వమన్నాడు. సరే అన్నాడు బ్రహ్మదేవుడు. ఇక మూడో వాడు కుంభకర్ణుడి దగ్గరికి వచ్చేసరికి, దేవతలంతా బ్రహ్మను వారించారు. అప్పటికీ కుంభకర్ణుడు భయంకరమైన రాక్షసుడు, అత్యంత శక్తివంతుడు. అంతటి శక్తివంతుడైన రాక్షసుడికి వరం ఇస్తే, అతన్ని కంట్రోల్ చేయడం ఎవ్వరి వల్లా కాదని భావించిన దేవతలు కాస్త ఆలోచించమని చెబుతారు.
దాంతో బ్రహ్మ దేవుడు తన భార్య సహాయం తీసుకుని, కుంభకర్ణుడికి వరం ఇవ్వాలనుకున్నాడు. కుంభకర్ణుడు వరం అడిగే సమయానికి అతని నాలుక మడత పడేలా చేయమని సరస్వతికి చెప్పాడు. దాంతో, కుంభకర్ణుడు ‘ఇంద్రాసనం’ కావాలని, కోర దలచి, నాలుక మడత పడడంతో, ‘విద్రాసనం’ అనేస్తాడు. వెంటనే బ్రహ్మ సరే అంచాడు. నిరంతరం నువ్వు నిద్రలోనే ఉండుగాక… అని వరమిచ్చేస్తాడు. అయితే, నిరంతరం నిద్రలోనే ఉంచడం భావ్యం కాదని, రావణాసురుడు వేడుకోగా, సరే, అయితే, ఆరు నెలలు నిద్రలో ఉంచాడు. ఒకే ఒక్కరోజు నిద్ర లేచి, ఆరు నెలలకు సరిపడా ఆహారం ఒకే రోజు భుజించి, మళ్లీ నిద్రలోని బారుకుంటాడు.. అని దానిచ్చిన వరంలో కాస్త సర్దుబాటు చేస్తాడు బ్రహ్మ దేవుడు. అలా ఆరు నెలలకు ఒకసారి మాత్రమే కుంభకర్ణుడు నిద్ర లేస్తాడన్న మాట. ఆరు నెలలకోసారి తింటాడు కాబట్టి, అంత ఆహారం ఒకేసారి తినేస్తాడు. అదీ కుంభకర్ణుడి విద్ర సంగతి.
రామ రావణ యుద్ధంలో కుంభకర్ణుడు పడుకున్న తొమ్మిది రోజులకి నిద్ర రివాల్సి వస్తుందట. రాముడు సాక్షాత్తూ విష్ణు మూర్తి స్వరూపమని కుంభకర్ణుడికి తెలుసు. అయినా అన్న మాట కోసం రామునిపై యుద్ధానికి బయలు దేరతాడు. రామ బాణానికి యుద్ధంలో వీర మరణం పొందుతాడు. ఇవీ కుభకర్ణుడి తిండి, నిద్ర, మరణం వెనక దాగున్న రహస్యాలు.