ఉచిత కోచింగ్ అధ్యాపకులను సన్మానించిన కేయూ రిజిస్టర్

ఉత్తమమైన అధ్యాపకుల పర్యవేక్షణలో శిక్షణ అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది.. ఆచార్య పి మల్లారెడ్డి.
కేయూ క్యాంపస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ రిక్రూట్మెంట్ మరియు ఉపాధ్యాయ ఉద్యోగ ఫలితాలలో
కాకతీయ విశ్వవిద్యాలయ ఫ్రీ కోచింగ్ విద్యార్థులు ప్రతిభ చూపారు. 69 మంది కానిస్టేబుల్స్
ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఒకరు గ్రేడ్ వన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, జేఎల్ఎం ఒకరు, ఎన్నికై శిక్షణ పొందుతున్నట్లు కోచింగ్
సెంటర్ సంచాలకులు డాక్టర్ టీ నాగయ్య తెలిపారు. అదేవిధంగా ఇటీవల విడుదల చేసిన గురుకుల సొసైటీ ఫలితాలలో పిజిటి, టీజీటీ జెల్ మరియు డిఎల్ ఉద్యోగాలు విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. 2022 మార్చిలో కాకతీయ విశ్వవిద్యాలయం పేద విద్యార్థుల కోసం ఉచిత కోచింగ్ సెంటర్ కేయూలో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దాదాపు 6 నెలలు పాటు సుదీర్ఘ బోధన అనుభవం వివిధ
విభాగాలలో నిష్ణాతులైన అధ్యాపకులచే శిక్షణ ఇచ్చారు.
విశ్వవిద్యాలయ ఫ్రీ కోచింగ్ సంచాలకులు డాక్టర్ నాగయ్య అధ్యక్షతన వర్సిటీలో శనివారం అభినందన
కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిథిగా
కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య పి మల్లారెడ్డి హాజరై అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. ఎక్కువమంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన కోచింగ్ సెంటర్ సంచాలకులు డాక్టర్ నాగయ్య ను రిజిస్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ సబ్జెక్టులలో నిష్ణాతులైన అధ్యాపకులు కె. మధు, గోలి ప్రశాంత్ రెడ్డి, యాకన్న, లక్ష్మణ్, డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ వీరస్వామి, డాక్టర్ శంకర్, వీణ ను రిజిస్టర్ సన్మానించి వారిని అభినందించారు. రానున్న రోజులలో కూడా వర్సిటీకి సహాయ సహకారాలు అందించాలని అధ్యాపకులను కోరారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ చందూలాల్, డాక్టర్ రమేష్ డాక్టర్ చిలువేరు రాజకుమార్, శివాజీ, రాకేష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!