మల్కాజిగిరి,నేటిధాత్రి:
ఎంఎంటీఎస్ ఫేస్ 2 లో భాగంగా మంగళవారం ఘట్కేసర్ నుండి బయలు చేరిన మొదటి రైలుకు, మల్కాజిగిరి నియోజకవర్గం నేరెడీమేట్ రైల్వే స్టేషన్ లో స్థానిక మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ రైలు స్టేషన్ కి చేరుకోగానే పూలు చల్లి భరత్ మాత కి జై,నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిలాలి, కిషన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ పూలు చెల్లి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రావణ్ మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా, కిషన్ రెడ్డి చొరవతోనే కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ వాటా ను చెల్లించి పనులు పూర్తి చేసిందని మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ అన్నారు.రైల్వే సికింద్రాబాద్ డివిజన్ అధికారులు ప్రోటోకాల్ పాటించడంలో, స్థానికంగా ఏర్పాట్లు చెయ్యడంలో విఫలం అయ్యారని, దీన్ని రైల్వే ఉన్నంతధికారులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బాలింగం, డివిజన్ ప్రెసిడెంట్ ఓం ప్రకాష్, వైస్ ప్రెసిడెంట్ లు నందు యాదవ్, మురళి గౌడ్, సంతోష్, రవి, ప్రభు గుప్తా, కృష్ణ మూర్తి, అంజన్న, సుకేష్, శ్రీకాంత్, సుశీల, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.