కొంపలు ముంచిన కొండా!

https://epaper.netidhatri.com/

`అధికారంలో వున్నంత కాలం జనం ముఖం చూడలేదు!

`చేవెళ్ల నియోజకవర్గం పట్టించుకోలేదు.

`వ్యాపారాలలో మునిగి తేలిండు.

`కాంట్రాక్ట్‌ పనులతోనే కాలం వెల్లదీసిండు.

`నమ్మిన సబ్‌ కాంట్రాక్టర్ల బిల్లులు ఎగ్గొట్టిండు.

`వాళ్ల జీవితాలను బుగ్గిపాలు చేసిండు.

`ఇప్పుడు ఓట్ల కోసం ఊరూరు తిరుగుతుండు.

`అబద్ధాలు ప్రచారం చేస్తుండు.

`అఫిడవిట్లలో రూ.4వేలకు పైగా కోట్లు చూపించిండు.

`కూలీలకు ఆశలు రేపి సబ్‌ కాంట్రాక్టర్లగా నమ్మించిండు.

`వాళ్ల చేత కోట్లు ఖర్చు పెట్టించిండు.

`పనులన్నీ చేయించుకొని మోసం చేసిండు.

`సబ్‌ కాంట్రాక్టర్లను ముంచి కోట్లకు పడగలెత్తిండు.

`చేవెళ్ళ నియోజకవర్గంలో సేవ చేసింది లేదు.

`గతంలో గెలిచి ఒరగబెట్టింది లేదు.

`మళ్ళీ నమ్మితే మోసం చేయకుండా వుండలేడు.

`నేటిధాత్రికి కొండా అనుచరుల బెదిరింపులు.

`దాడులు చేస్తామని హెచ్చరికలు.

`అమాకులైన యువతను నీ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోకండి.

`వారి జీవితాలను కూడా బలి చేయకండి.

`వ్యాపారం ముసుగులో ఎంతో మందిని ముంచింది చాలు.

`బాధితులకు అండగా ఎంత దూరమైన నేటిధాత్రి వెళ్తుంది.

`ఇరవై ఏళ్లుగా నేటిధాత్రికి బెదిరింపులు కొత్త కాదు.

`బాధితుల పక్షాన నిలిచేందుకు ఎప్పుడూ వెనుకడు వేయలేదు.

`అన్యాయం చేసిన వారిని నేటిధాత్రి వదిలిపెట్ట లేదు.

`న్యాయం జరిగేదాకా విశ్రమించింది లేదు.

`ఇప్పుడు కూడా అంతే

`బాధితులకు న్యాయం జరిగే దాక వారి వెనకే

`పిట్ట బెదిరింపులు మాని బాధితులకు న్యాయం చేయండి.

`తప్పైందని ఒప్పుకోండి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

నేటిధాత్రికి నిజాలు రాయడం మాత్రమే తెలుసు. అబద్దాల అల్లికలు ఎప్పుడూ చేయదు. ఆ అవసరం, అవకాశం లేదు. రాదు…ఇది నేటిధాత్రికి వున్న నిబద్దత. గత కొన్ని రోజులుగా చెవెళ్ల మాజీ ఎంపి. కొండా విశ్వేశ్వరరెడ్డి చేసిన దురాగతాల మీద నేటిధాత్రి వరుస కథనాలు ప్రచురిస్తోంది. అందులో ఆయన వల్ల నష్టపోయిన కుటుంబాల గురించి మాత్రమే రాయడం జరుగుతోంది. కొండా వల్ల జీవితాలు ఆగమైన బతుకుల గురించి మాత్రమే ప్రస్తావించడం జరుగుతోంది. అందులో రాజకీయాలకు తావులేవు. కొండాకు నేటిధాత్రి వ్యతిరేకంగా వార్తలు రాయాల్సిన అవసరం లేదు. కాని కొండా విశ్వేశ్వరెడ్డి తన పదవిని అడ్డం పెట్టుకొని, అమాయకులను ఎలా మోసం చేశాడు. ఎలా వంచించాడు. వారి బలహీనతలు ఎలా సొమ్ము చేసుకున్నాడు. వారికి లేని పోని ఆశలు కల్పించి వారి చేత ఎలా కోట్లు ఖర్చు పెట్టించాడు. వారి జీవితాల్లో నిప్పులు ఎలా పోశాడన్న వాటిని కళ్లకు కట్టినట్లు రాయడం జరుగుతోంది. ఎందుకంటే నేటి ధాత్రి చెప్పేవన్నీ నిజాలు. అక్షర సత్యాలు. అందుకే కొండా విశ్వేశ్వరెడ్డికి అవి నచ్చడం లేదు. జీర్ణించుకోలేకపోతున్నాడు. దాంతో నేటిధాత్రికి తన అనుచరులతో బెదిరిస్తున్నాడు. హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. అంతు చూస్తామంటూ మెసేజ్‌లు పెడుతున్నారు. ఫోన్లు చేస్తున్నారు. అయినా నేటిధాత్రికి ఇలాంటి పిట్ట బెదిరింపులు కొత్త కాదు. నేటిధాత్రి అక్షర ప్రయాణం మొదలు పెట్టిన నాటి నుంచి ఇలాంటి బెదిరింపులు అనేకం చూసింది. వాటిని ఎదుర్కొన్నది. నిజాలు నిగ్గు లేల్చింది. అన్యాయాలు చేసిన వారిని నిలదీసింది. ప్రజల ముందు దోషిగా నిలబెట్టింది. అదీ నేటిధాత్రి అక్షరం. నిప్పు కణం. దాన్ని తట్టుకోవడం అక్రమార్కులకు సాధ్యం కాదు. అందుకే నేటిధాత్రి కథనాలకు తట్టు కోలేక, నిజాలు జీర్ణించుకోలేక కొండా విశ్వేశ్వరెడ్డి తన అనుచరులను ఉసిగొల్పుతున్నారు. తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఇది ఎప్పటికీ మంచిది కాదు. నేటి దాత్రి కోరుకునేది ఒక్కటే… కొండా ఎవరెవరికైతే అన్యాయం చేశాడో వారిని న్యాయం చేయండి. అదే నేటిధాత్రి కోరుకునేది. అన్యాయాన్ని ప్రశ్నించేందుకే నేటిధాత్రి అక్షరం వున్నది. అది ముందు తెలుసుకోండి. బాధితులకు న్యాయం జరిగే వరకు నేటిధాత్రి విశ్రమించదు. తన అక్షర గాండీవాలు ఆపదు. అన్యాయానికి గురైన వారి పక్షాన పోరాటం చేస్తూనే వుంటుంది. వారికి న్యాయం జరిగే వరకు కొట్లాడుతూనే వుంటుంది.
కొండా విశ్వేశ్వరెడ్డి తన గుండెల మీద చేయి వేసుకొని చెప్పమనండి.
తన స్వార్ధం కోసం ఎంతో మంది జీవితాలతో ఆడుకోలేదా? ఎవరెస్టు కంపనీ పేరుతో చేసిన మిషన్‌ భగీరథ పనుల కోసం వచ్చిన వారిని మభ్య పెట్టలేదా? వారిని సబ్‌ కాంట్రాక్టర్లుగా మార్చుతానని మభ్యపెట్టలేదా? వారి చేత కోట్ల రూపాయల పనుల చేయించుకోలేదా? వారికి రావాల్సిన బల్లులు ఎగ్గొట్టలేదా? వారికి ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ కాలేదా? తమకు రావాల్సిన బిల్లుల గురించి అడుతున్నందుకు వారిని బెదిరించలేదా? కార్యాలయం వైపు తొంగి చూసినా సహించేది లేదని హెచ్చరించలేదా? మీ దిక్కున్న చోట చెప్పుకోమని కార్యాలయం నుంచి గూండాలను పెట్టి వెల్లగొట్టించలేదా? రాత్రికి రాత్రి కొన్నివందల మందిని హుస్నాబాద్‌కు తరలించి, నమ్మిన పాపానికి సబ్‌ కాంట్రాక్టర్లను బెదిరంచలేదా? బాల సబ్బయ్య అనే వ్యక్తి జీవితం మొత్తం సర్వనాశనం చేయలేదా? పనులు చేస్తున్న కాలంలో ఓ వ్యక్తి చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని ఆదుకున్నావా? శవాన్ని పంపించి చేతులు దులుపుకోలేదా? ఇలా ఎంత మందిని మోసం చేశారో లెక్క మొత్తం నేటిదాత్రి చేతిలో వుంది. వారు పడిన కష్టాలు నేటిధాత్రికి తెలుసు. అందుకే కొండా విశ్వేశ్వరరెడ్డి మరోసారి ప్రజలను మోసం చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో పత్రికలకు వుంది. అదే నేటిధాత్రి చేస్తోంది. 2014లో చెవెళ్ల ఎంపిగా గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని ఏనాడైనా పట్టించుకున్నావా? ప్రజలకు కొండా సేవ చేస్తే 2019లో ఎందుకు ఓడిపోయినట్లు? నిజంగానే ఎంతో మేలు చేసే రకమైతే ప్రజలు ఎందుకు ఓడిరచినట్లు? ఎంతో మంది ఎంపిలు ఒకటికి నాలుగు సార్లు గెలిచిన వాళ్లున్నారు. కాని ఒక్కసారి గెలిపించిన ప్రజలు రెండోసారి కొండాను ఎందుకు ఎన్నుకోలేదు. కారణం ఎంపిగా గెలచిన కొండా నియోజకవర్గాన్ని గాలికొదిలేశారు. కాంట్రాక్టర్‌ అవతారం ఎత్తాడు. ఎంపిగా తనకు ఎలాంటి సంబంధం లేదంటూనే చేయాల్సినంత చేశాడు. దోచుకోవాల్సినంత దోచుకున్నాడు. ప్రజలకు సేవ చేయాల్సిన బాద్యత వదిలేసి ఎవరెస్టు కంపనీ పేరు మీద మిషన్‌ భగీరధ పనులు ఎందుకు చేసినట్లు? ప్రజలకు ఏం సమాధానం చెబుతావు? అన్ని ప్రజలే ప్రశ్నిస్తున్నారు.
ఎంతో నమ్మకంతో చెవెళ్ల ప్రజలు గెలిపిస్తే కొండా చేసిన నిర్వాకమేమిటి?
కాంట్రాక్టుల్లో మునిగిపోయి, ప్రజలను మర్చిపోయాడు. ఓడిపోయిన తర్వాత ప్రజలు గుర్తుకొచ్చారు. పదవి గొప్పదనం తెలిసొచ్చింది. మళ్లీ పదవి కావాలనుకుంటున్నాడు. అందులో తప్పు లేదు. కాని ఈ ఐదేళ్లలో నియోజకవర్గం మొత్తం గ్రామాలను మూడు నాలుగు సార్లు చుట్టి వచ్చావా? ఎందుకు? ఇన్ని రోజుల్లో ఏ ఒక్క గ్రామాన్నైనా దత్తత తీసుకున్నావా? కోటి రూపాయల సాయం చేశావా? ఎన్నికల అఫిడవిట్‌లో రూ.4వేలకోట్లకు పైగా ఆస్ధులు చూపించావు. ప్రజా సేవ చేస్తానని మళ్లీ పాత పాట పడుతున్నావు. రాజకీయాలను కోరుకుంటున్నావు. అంటే వ్యాపార విసృతి కోసం వస్తున్నావా? ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నావా? అన్నది ముందు ప్రజలకు స్పష్టంచేయాల్సిన బాధ్యత కొండా మీదవుంది. ప్రజా సేవ చేయాలన్న సంకల్పమే వుంటే, వ్యాపారాల ద్వారా వచ్చిన ఆదాయంలో ఎంపిగా వున్న ఐదేళ్లలో ఎంత పంచావు? పదవి పోయిన తర్వాత ఊరూరు తిరిగి ఎంత సేవ చేశావు? అన్నది ప్రజలకు తెలియదా? వేల కోట్ల వ్యాపారివైనా ఓట్లు అడుక్కుంటున్నావు? అదే ప్రజా స్వామ్య గొప్పదనం. దాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు పెంచుకోవాలని చూస్తున్నావు? అందుకే ప్రజలు కొండాను ప్రజలు ఆదరించడం లేదు. గత ఎన్నికల్లో గెలిపించలేదు. ఆ సత్యం ఓడిపోయినా కొండాకు అర్ధం కాలేదు. కాని రాజకీయాలు మాత్రం వదులుకోలేదు. పార్టీలు మార్చుతూ రాజకీయ పలుకుబడి కోసం పాకులాడుతున్నాడు. ప్రజలను ఎలా మోసం చేయాలి. గెలిచి వ్యాపారాలు ఎలా పెంచుకోవాలని అన్నదానిపై వున్న శ్రద్ద ప్రజలకు సేవ చేయడంలో లేదని సాక్ష్యాత్తు చెవెళ్ల ప్రజలే అంటున్నారు. కొండా మద్దతు దారులు ప్రచారానికి వెళ్తుంటే ముఖం మీదే చెప్పేస్తున్నారు.
కొండా చేసిన మోసాలు ప్రజలకు బాగా తెలుసు.
నిజానికి కొండా మిషన్‌ భగీరధ పనులు చేయాలనుకుంటే ఎక్కడ చేయాలి? చెవెళ్లలో చేయాలి. తన ప్రజలకు మేలు చేసేందుకు పూనుకోవాలి. కాని కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపిగా వుండి కూడా తన నియోజకవర్గంలో మిషన్‌ భగీరధ పనులు చేయలేదు. తన నియోజకవర్గంలో పనులు చేసి, తన నియోజకవర్గ ప్రజలకు ఉపాధి కల్పించలేదు. కనీసం తన అనుచరులకు సబ్‌ కాంట్రాక్టులు ఇవ్వలేదు. కారణం తాను మోసం చేసి వ్యాపారాలు సాగించాలనుకున్నాడు. తన నియోజకవర్గంలో మోసాలు చేస్తే రాజకీయ భవిష్యత్తు వుండదని కొండాకు తెలుసు. అందకే సిద్దిపేట జిల్లాను ఎంచుకున్నాడు. అక్కడి ప్రజలను నమ్మించాడు. అక్కడ పనిచేసేవారికి మాయ మాటలు చెప్పి, వారిని నిండా ముంచాడు. ఇదీ కొండా చేసిన అరాచకం. అక్రమ సంపాదనకు మార్గం. ఇప్పుడు సుద్ద పూసలాగా మాట్లాడుతున్నాడు. బాల సుబ్బయ్య అనే వ్యక్తి తన గ్రామంలో చేసిన అప్పులకు వడ్డీలకు , చక్రవడ్డీలు పెరిగి, అప్పుడు ఐదు కోట్లకు చేరింది. కాని కొండా విశ్వేశ్వరరెడ్డి అతనికి రావాల్సిన బిల్లులు ఇచ్చింది లేదు. అలా తెలంగాణ వ్యాప్తంగా ఎంతోమంది జీవితాలలో ఆడుకున్న చరత్ర కొండా విశ్వేశ్వరరెడ్డిది. గెలిపించుకున్న ప్రజలకు న్యాయం చేయలేదు. నమ్మిన వారికి మేలు చేయలేదు. కాని కొండా ఆస్ధులు మాత్రం వేల కోట్లకు చేరుకున్నాయి. ఐదేళ్లపాటు పనులు లేక, వ్యాపారాలు లేక ఆవురావురుమన్నట్లున్నాడు. గెలిపిస్తే మళ్లీ అక్రమ వ్యాపారాలు మాత్రమే చేసుకుంటాడు. జనం సమస్యలు గాలికి వదిలేస్తాడు..ఇది ఆయన రాజకీయ ప్రత్యర్ధులంటున్నారు. చెవెళ్ల ప్రజలు కూడా చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!