– పని చేయలేని స్థితిలో అమ్మానాన్నలు
– అన్ని తానై కుటుంబాన్ని పోషిస్తున్న కూతురు
– దివ్యాంగురాలు గొట్టే సుమలతకు అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి
– కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తో మాట్లాడి కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగం కల్పించిన కేకే
సిరిసిల్ల(నేటి ధాత్రి):
ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన గొట్టే సుమలత పుట్టుకతోనే దివ్యాంగురాలు. చదువుకోవడానికి తన అంగవైకల్యం అడ్డు రాలేదు.ఉన్నత చదువులు చదివింది కానీ ఉపాది లేకుండా ఉండి పోయుంది.తల్లిదండ్రులు ఇద్దరూ వృద్దులు కావడంతో పనిచేయని స్థితిలో ఉండడంతో తనకొచ్చె పెన్షన్ డబ్బుతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. తనకు ఏదైన ఉపాధి చూపాలని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డిని కలిసి అడిగారు, వెంటనే స్పందించిన కేకే మహేందర్ రెడ్డి కలెక్టర్ సందీప్ కుమార్ ఝ కు విషయం తెలియజేశారని తెలిపారు. వెంటనే స్పందించిన కలెక్టర్.. కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగం కల్పించారని సంతోషం వ్యక్తం చేశారు. సుమలత వారి కుటుంబ సభ్యులు ఉద్యోగ భరోసా కల్పించిన కేకే మహేందర్ కి కృతజ్ఞతలు తెలిపారు.