
మృతుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిస్తున్న చదువు అన్నారెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన దండు తిరుపతి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా తన సన్నిహితుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న సర్పంచుల ఫోరం మొగుళ్ళపల్లి మండల మాజీ అధ్యక్షుడు..ముల్కలపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చదువు అన్నారెడ్డి సోమవారం మృతుని ఇంటికి వెళ్లి దండు తిరుపతి చిత్రపటానికి పూలమాలవేసి, ఘనంగా నివాళులర్పించి..మృతుని కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పరామర్శించి..ఓదార్చి…మృతుని కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించి..తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా చదువు అన్నారెడ్డి మాట్లాడారు. మృతుడు దండు తిరుపతి క్రికెట్ ప్లేయర్ గా తన ఆట తీరుతో టీంను గెలిపించి..ఎన్నో బహుమతులను సాధించి మొగుళ్ళపల్లి మండల కేంద్రంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ఆయన మృతి తీరని లోటన్నారు. దండు తిరుపతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని వేడుకున్నట్లు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చెక్క శ్రీధర్, శనిగరపు శ్రీనివాస్ బండారి రామస్వామి, ఎరబాటి మహేందర్, అరికాంతపు అన్నారెడ్డి, బండారి బిక్షపతి, దేవునూరి కుమారస్వామి, గుడిమల్ల రమేష్ కార్తీక్ మంగళపల్లి సాంబయ్య తదితరులున్నారు.