వైద్య అసిస్టెంట్ డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా
కలిసిన జిల్లా వైద్య హెచ్.వన్ సంఘo అధికారులు
సిరిసిల్ల టౌన్ : (నేటి ధాత్రి)
తెలంగాణ వైద్య ప్రజా ఆరోగ్య ఉద్యోగుల H -1 సంఘం ఆధ్వర్యంలో అబ్దుల్ ఖాదర్ కు సన్మాన కార్యక్రమం.వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం కరీంనగర్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నుండి అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రమోషన్ పై ప్రభుత్వ మెడికల్ కాలేజీ సిరీసిల్ల జిల్లా కు వచ్చిన అబ్దుల్ ఖాదర్ కు సన్మాన చేయడం జరిగింది. ఈ సందర్భముగా యూనియన్ రాష్ట్ర జిల్లా నాయకులు మాట్లాడుతూ అబ్దుల్ ఖాదర్ గత 35 ఇయర్స్ నుండి వైద్య ఆరోగ్య శాఖ లో వివిధ హోదాలలో నిబద్ధతో పని చేస్తూ పై అధికారుల మన్నన పొందారని వృత్తి పట్ల చాలా గౌరవంగా ఉంటారనీ తెలిపారు. సౌమ్యంగా వ్యహరిస్తూ కింది స్థాయి సిబ్బంది తో పని చేయిస్తారని తెలుపుతున్నాం. అలాగే ఈ యొక్క ప్రమోషన్ పొందిన పోస్ట్ లోకూడా సక్సెస్ గా ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాము.మరియు ఈ సందర్భముగా B. లక్ష్మీ నారాయణ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ బొకే ఇచ్చి మర్యాద పూర్వకముగా కలిశారు.సన్మాన కార్యక్రమం లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ సూపరిడెంట్ MD. షమీము, జిల్లా యూనియన్ నాయకులు MD. అజీజ్ B. జనార్దన్ మరియు రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ యన్.శ్రీనివాస్ కర్ణ రాష్ట్ర జాయింట్ జనరల్ సెక్రటరీ ఆఫ్తాబ్ అహ్మద్ ఖాన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ ప్రెసిడెంట్ T. రవీందర్ బ్లడ్ బ్యాంక్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు MD.రఫీ మరియు అంజయ్య, MD. రషీద్ రవి, రాహుల్, మౌనిక మరియు కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.