అమిత్ షా చెప్పులు మోసుకో…
గద్దర్ కాలి చెప్పు కూడా నిన్ను అసహ్యించుకుంటుంది
గద్దరన్నను విమర్శించే స్థాయా నీది.
తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పొడిచిన పొద్దు..
గద్దర్ కు అవార్డు ఇవ్వకపోవడం బిజెపి కుట్రే.
అమరవీరుల స్తూపం వద్ద క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలి.
తెలంగాణ జన సమితి పార్టీ
నియోజకవర్గ కన్వీనర్
పూణెం ప్రదీప్ కుమార్ డిమాండ్.
నేటి దాత్రి భద్రాచలం
ప్రజా కవులపై, కళాకారులపై, తెలంగాణ ప్రజలపై మరోసారి బిజెపి కపట ప్రేమ బయటపడిందని, గద్దర్ కు పద్మశ్రీ అవార్డు రాకపోవడం బిజెపి వైఖరికి నిదర్శనమని తెలంగాణ జన సమితి పార్టీ భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్ పూనెం ప్రదీప్ కుమార్ అన్నారు. ప్రజా సమస్యలే ఏజెండాగా అడవి బాట పట్టిన గద్దరన్న తుపాకీ కంటే భారత రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం దిశగా మాత్రమే సమస్యలు తీరుతాయనే దృఢ సంకల్పంతో జన జీవన స్రవంతిలో కలిసి, ప్రజలను చైతన్యం చేయడం ద్వారా ప్రజా యుద్ధనౌకగా పేరుగాంచిన వ్యక్తి గద్దర్ అని ఆయన కొనియాడారు. అమిత్ షా కాలు చెప్పులు మోసుకుంటూ బిజెపి పార్టీ పడవేసే పదవులను అడ్డం పెట్టుకొని బతుకుతున్న నువ్వు గద్దర్ ను విమర్శించే స్థాయి కాదని గుర్తు చేసుకోవాలన్నారు. పొడుస్తున్న పొద్దు అనే పాట లేకుంటే తెలంగాణ ఎప్పటికీ వచ్చే అవకాశం ఉండేది కాదనే విషయం గుర్తెరగాలని, ఆరోజు కాలుకు గజ్జ కట్టి వాడవాడలో తిరిగి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను, చైతన్యాన్ని రగిలించి తెలంగాణ సాధనలో భాగస్వామైన గద్దర్ ను విమర్శించడం సూర్యుని మీద ఉమ్మి వేయడం లాంటిదేనని ఆయన మండిపడ్డారు. అనేకమంది వీరుల త్యాగ పోరాటం ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నీకు పదవి వచ్చిందంటే అది ఆ వీరుల త్యాగఫలమైన అని గుర్తు పెట్టుకోవాలన్నారు. అసలు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడ దాక్కున్నావని, తంబాకు తింటూ తడిగుడ్డ వేసి పడుకున్న నువ్వు, ఉద్యమ సమయంలో లేని నీకు తెలంగాణలో పదవి ఇవ్వడం బిజెపి పార్టీకే సిగ్గుచేటని ఆయన అన్నారు. అమరవీరులపై అవాకులు చవాకులు పేలితే తెలంగాణ సమాజం నిన్ను విడిచిపెట్టదని, యావత్ తెలంగాణ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పి అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాసి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.