డీజీఎం చీఫ్ కోఆర్డినేటర్ డి.పంతులా
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో నిర్వహిస్తున్న 11వ సీజన్ క్రికెట్ పోటీల్లో మంగళవారం ఉదయం ఎస్టిపిపి పైలేట్స్ మరియు సిఐఎస్ఎఫ్ మధ్య ఐదో మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్న పైలెట్స్ జట్టు 11.2 ఓవర్లలో 61 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. సిఐఎస్ఎఫ్ జట్టు బౌలర్ పలక్ష మూడు ఓవర్స్ వేసి 9 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన రెండు వికెట్లు పడగొట్టారు.
చేదనలో సిఐఎస్ఎఫ్ జట్టు 9 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 64 పరుగులు చేసి విజయం సాధించింది. సిఐఎస్ఎఫ్ జట్టు తరుపున పలక్ష మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డును మదన్మోహన్, ఏజీఎం (ఈ & ఎం) చేతుల మీదుగా అందుకున్నారు.
మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ పీఈఎస్ పవర్ హిట్టర్స్ మరియు థండర్ స్ట్రైకర్స్ జట్ల మధ్య పోటీ నెలకొంది.మొదట బ్యాటింగ్ చేసిన పీఈఎస్ జట్టు నిర్దిత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది.తదుపరి చేదనలో థండర్ స్ట్రైకర్స్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 82 పరుగులు మాత్రమే చేసి ఒక్క పరుగు తేడాతో త్రుటిలో పరాజయం పాలైంది.చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో పీఈఎస్ జట్టు తరఫున ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన కౌశిక్ మూడు ఓవర్లు వేసి 13 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన మూడు వికెట్లు తీశాడు.అలాగే బ్యాటింగ్ లో పది బంతులు ఆడి 22 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.ఈ అవార్డును సుధాకర్ ఏజీఎం (ఫైనాన్స్)చేతులు మీదుగా అందుకున్నారు.