రాబోయే శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని.

 

> పోలీస్ సెక్టోరియల్ అధికారులకు మరియు పోలీస్ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించిన.

> జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

రాబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా పోలీసు అధికారులు ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమాలు,చేపట్టవలసిన చర్యలపై జిల్లా పోలీసు పోలీస్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుదవారం జిల్లా ఎస్పీ కే నరసింహ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…
రాబోయే శాసనసభ ఎలక్షన్స్ సందర్భంగా పోలీసులు అందరూ ఎన్నికల సంఘం నియంత్రణ, పర్యవేక్షణ మరియు క్రమశిక్షణకు లోబడి పని చేయాలని సూచించారు. ఎన్నికల కమిషనర్ అధికారి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు తమ విధులు నిర్వర్తించాలని తెలిపారు. జిల్లా లో మూడు నియోజకవర్గాలైన, మహబూబ్ నగర్, జడ్చర్ల మరియు దేవరకద్ర నియోజకవర్గాలకు డిఎస్పీలు ఇన్చార్జిలుగా ఉండి బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది.
ఎలక్షన్స్ సమయంలో పోలీసు అధికారులు ఎలక్షన్ ముందు, ఎలక్షన్ రోజు, ఎలక్షన్ తర్వాత, తీసుకోవలసిన చర్యల గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని, ఎలక్షన్స్ సందర్భంగా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల పై పూర్తిగా అవగాహన కలిగి ఉండి, పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే గ్రామాలలో ఎలాంటి సమస్యలు లేకుండా, సమస్యలు సృష్టించే వారినీ బైండోవర్ చేయాలని తెలిపారు. ఇంతకు ముందు ఎలక్షన్స్ సమయంలో సమస్యలు సృష్టించే వారి పై పూర్తి నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు. పోలీస్ అధికారులు ఎలక్షన్ సమయంలో సమస్యలు సృష్టించే వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాలను విధిగా పర్యటిస్తూ గ్రామాలపై దృష్టిసారించాలని తెలిపారు. జిల్లా ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్లాన్ ప్రకారం బందోబస్తు తయారు చేసుకోవాలని కోరారు. పోలింగ్ రోజు పోలింగ్ స్టేషన్ల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుంది, అందుకు కావలసిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు, డిఎస్పీ లు మహేష్, శ్రీనివాసులు, సీసీ రాంరెడ్డి, సీఐ లు, సిఐ లు, ఐటీ కోర్ సిబ్బంది, సెక్టరియల్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!