జల దృశ్యం నుంచి సుజల దృష్యం సృష్టి!

https://epaper.netidhatri.com/

ఆందోళ్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ ఉద్యమ ఆవిర్భావ కాలం నుంచి ఆత్మ గౌరవ పాలన దాకా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఉద్యమ, పాలన ప్రస్థానంపై నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే..

`కరువు నేలన నిన్న కేసిఆర్‌ కొట్లాట..

` నేడు కరువు తీర్చిన కేసిఆర్‌ పాలన.

` స్వపరిపాలనలో వెల్లివిరిసిన ఆత్మగౌరవం.

`తలెత్తుకొని నిలబడిన తెలంగాణం.

` విఫల విభనగా దుష్టుల పన్నాగం

`చేధించిన కేసిఆర్‌ అపర చాణక్యం.

`నిన్న బీడుల తెలంగాణ.. నేడు సిరుల మాగాణ.

`తెలంగాణ పచ్చని పైట హొయలు.

`చుక్క నీరు లేని చోట నీటి పరవళ్లు.

`ఏడాదంతా చెరువుల జలకళలు.

` కాలువలు నిండుగా, పొలాలు పండుగలా…

`ఎటు చూసినా నీటి సోయగాలే….

`తెలంగాణ నిండా బంగారు పంటలే.

హైదరబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణ వచ్చి దశాబ్ధ కాలమౌతోంది. పద్నాలుగేళ్ల సుదీర్ఘ ఉద్యమ పోరాటం సాగించి, తెలంగాణ సాధించి, పదేళ్లుగా తెలంగాణకు స్వర్ణ యుగ పాలనందిస్తున్న నాయకుడు కేసిఆర్‌. ముఖ్యమంత్రి కేసిఆర్‌ మొక్కవోని ధైర్యం ఎలాంటిదో ఈ తరానికి తెలియాల్సిన అవసరం వుంది. ఆయన ఎంతటి యుగ కర్తో తెలియాలి. తెలంగాణ సారధిగా ఎలా మారారో తెలుసుకోవాలి. తెలంగాణ పితగా ఆయన అందుకుంటున్న కీర్తి అందరికీ తెలియాలి. ఎందుకంటే పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా వుండేది? ఇప్పుడు ఎలా వుంది? అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది. ఎందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ 2001లో తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టాల్సి వచ్చింది. తెలంగాణ ఆవిర్భావం ఎలా జరిగిందనేది నేటి తరం తెలుసుకోవాలి. ఈ రోజు ఇంతటి తెలంగాణను యువత చూస్తుందంటే అందుకు కారణం ముఖ్యమంత్రి కేసిఆర్‌. ప్రజలు కోరుకున్న తెలంగాణ ఆవిష్కారం జరడానికి కేసిఆర్‌ ఎంత కష్టపడ్డాడన్నది తెలియాలి. మాటలు చెప్పేవారు చాల మంది వుంటారు. పదవుల కోసం రాజకీయాలు చేసేవారు చాలా మంది వున్నారు. కాని ప్రజల కోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టి, తెలంగాణ సమాజం కోసం ఉద్యమ రాజకీయం చేసిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. ప్రపంచ చరిత్రలో ఉద్యమాన్ని పోరాటరూపంలోకి మలిచి, రాజకీయం అనుసందానం చేసి, ప్రజల ఆకాంక్ష నేరవేర్చిన ఒకే ఒక్క నాయకుడు కేసిఆర్‌. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని నేటి తరానికి తెలయకుండా, నాడు తెలంగాన సమజం పడిన గోస చెప్పకుండా, నాడు ఎలాగైతే రాజకీయ లబ్ధి కోసం మసిబూసి మారేడు కాయ చేశారో ఇప్పుడూ అదే పంధాలో సాగుతున్నారు. ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్‌, బిజేపిలు, తెలంగాణ ప్రజల మేలు ఓర్వడం లేదు. ప్రజలు సుఖంగా వుండడం వారికి ఇష్టం లేదు. కరంటుకోతలు లేని వెలుగులు వారికి నచ్చడం లేదు. పంటలు సమృద్ధిగా పండడం జీర్ణించుకోవడం లేదు. ఎడారి లాంటి తెలంగాణలో నీటి పరవళ్లు చూసి కుళ్లుకుంటున్నారు. నాడు నీటి కోసం ఏడ్చిన తెలంగాణ ఎలా వుండేదో నేటి తరం తెలుసుకోవాలి. ఆనాడు ప్రజలు పడిన కష్టం తెలియాల్సిన అవసరం వుంది. లేకుంటే ఈ తరాన్ని మాయ చేసి, మభ్యపెట్టే దుష్టపన్నాగాలు ప్రతిపక్షాలు పన్నుతున్నాయి. తెలంగాణ ఇచ్చింది మేమే అంటూ సన్నాయి నొక్కులు నొక్కులతో చిలకపలుకులు పలుకుతున్నారు. తెలంగాణ ఎప్పుడు ఇచ్చారు? ఎలా ఇచ్చారు? ఎందుకిచ్చారు? ఇస్తామని చెప్పిన వెంటనే ఎందుకు ఇవ్వలేదు? పదేళ్ల కాలయాపన ఎందుకు చేశారు? తెలంగాణ యువత బలిదానాలు చేసుకుంటున్నా, ఎందుకు చోద్యంచూశారు? నాటి తెలంగాణ కాంగ్రెస్‌నేతలు ఎందుకు రాజీనామాలు చేయలేదు? అసలు తెలంగాణ మొదటిసారి 2009 ప్రకటన ఎందుకొచ్చింది? కేసిఆర్‌ నిరాహార దీక్ష మూలంగా తెలంగాణ ప్రకటన చేసి ఎందుకు వెనక్కి తీసుకున్నారు. సీమాంధ్ర నేతలకు లొంగి తెలంగాణ కాంగ్రెస్‌ నేతులు ఎందుకు వారి మోచేతి నీళ్లు తారారు? సమ్యైవాదం కోసం పార్టీలకతీతంగా ఆంధ్రా ప్రాంత ఎమ్మెల్యేలు ఏకతాటిపైకి వస్తే, తెలంగాన కాంగ్రెస్‌నేతలు ఎందుకు కలిసిరాలేదు? ఇవన్నీ చరిత్ర చెప్పే పాఠాలు…చారిత్రక సత్యాలు..వీటిని రేపటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి ఉద్యమకారుడి మీద వుంది. అరవై ఏళ్లలో యాభై ఏళ్లు పాలనచేసి, తెలంగాణను నిప్పుల గుండం చేసి ప్రజలను మల మాడేలా చేసిన కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ గురించి మాట్లాడే అర్హతే లేదు. ఇక్కడ రాజకీయం చేయడానికి వారికి అర్హతే లేదు. ఎందుకుంటే తెలంగాణ సాధన బిఆర్‌ఎస్‌ది. తెలంగాణ బాగు చేస్తున్నది బిఆర్‌ఎస్‌. ఇక్కడ రాజకీయాలు చేసే నైతికత వున్నది ఒక్క బిఆర్‌ఎస్‌కే. అంటున్న ఆందోళ్‌ ఎమ్మెల్యే చంటి కాంత్రి కిరణ్‌, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో కలిసి పంచుకున్న ఆనాటి విశేషాలు, విషయాలు ఆయన మాటల్లోనే…
ఇప్పటికీ తెలంగాణ మీద ఆశ తీరని, పెత్తనం మీద మోజు తీరని, తెలంగాణ బాగుపడితే చూడలేని కొంత మంది సీమాంధ్ర నేతల కనుసన్నల్లోనే కాంగ్రెస్‌నేతలు ఇంకా పనిచేస్తున్నారు.
వారి పెత్తనానికి ఇంకా చెప్పులు తొడుగుతూనే వున్నారు. వారు ఎదురైతే చాలు గడగడ వణికిపోతున్నారు. తెలంగాణలో ఏ చిన్న సందు దొరికినా దూరిపోయేందుకు సీమాంద్రకు చెందిన నేతలు కాచుకొని కూర్చున్నారు. గత ఎన్నికల సమయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. తెలంగాణ ఒక విఫల ప్రయత్నంగా చిత్రీకరించడానికి ఎమ్మెల్సీ ఎన్నికలను అనువుగా చేసుకొని, తెలంగాణ ద్రోహి రేవంత్‌రెడ్డితో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చంద్రబాబు చేశారు. అంటే తెలంగాణలో వున్న రేవంత్‌రెడ్డి లాంటి సీమాంధ్ర తాబేదార్లు ఇంకా వారికి ఊడిగం చేసుకునేందుకే ఇష్టపడుతున్నారు. వాళ్లు స్వతహా నేతలు కాదు. పరాన్న భుక్కులు. ఇతరుల రాజకీయం మీద ఆధారపడి ఎదిగేవాళ్లు. అందుకు ఇప్పటికీ సీమాంధ్ర నేతల భజన చేస్తూనే వున్నారు. తాజాగా కూడా కొన్ని సంఘటనలు రాష్ట్రంలో జరిగాయి. ఇదిలా వుంటే ఈ తరాన్ని మాయచేసి, మభ్యపెట్టి, అసత్యాలు వల్లిస్తూ, అబద్దాలు ప్రచారం చేసి, తెలంగాణను నిప్పుల్లోకి తోసేందుకు చూస్తున్న తెలంగాణ ద్రోహుల పట్ల అప్రమత్తంగా వుండాల్సిన బాధ్యత అందరిపై వుంది. తెలంగాణనుంచి తరమివేయబడ్డ వారిని మళ్లీ పిలిపించి రాజకీయం చేసే వాళ్లు పెరుగుతున్నారు. అందుకే అప్రమత్తత ఎంతో అవసరం.
తెలంగాణ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న జై తెలంగాణ నినాదం ఉద్యమ కారుడైన ముఖ్యమంత్రి కేసిఆర్‌ 2001లో పిడికెలెత్తగానే విస్పోటనమంత గర్జన మొదలైంది.
తెలంగాణ మొత్తం జై తెలంగాణ నినాదాలతో మారు మ్రోగిపోయింది. తొలి అడుగు నాడే కేసిఆర్‌ సాధించిన విజయం. అడుగడుగునా ప్రజలు తోడుగా, ఉద్యమానికి బాసటగా పల్లె జనం, పట్నం సమాజం అంతా ఏకమైంది. తెలంగాణ ఉద్యమానికి బలమైన నాయకుడు కావాలని కోరుకుంటున్న తెలంగాణ సమాజానికి కేసిఆర్‌ రూపంలో కొత్త ఊపిరి పోసుకున్నది. సమాజంలో ఆలోచన పెరిగింది. యువతలో ఉద్వేగం పెగిరింది. అన్ని వర్గాల ప్రజల్లో చైతన్యం రగిలింది. తెలంగాణ సమాజమంతా ఏకమైంది. ఏకతాటి మీదకు వచ్చింది. జై తెలంగాణ నినాదమే ఒక వేదమైంది. అది కేసిఆర్‌నోట వింటూ, వింటూ ప్రజలకు ఆ పదమే జపమైంది. తెలంగాణ సాధన దాకా వేదమంత్రమైంది. కేసిఆర్‌ తెలంగాణ సాధించేందుకు ఒక మార్గమైంది. కేసిఆర్‌ ఎంతటి మొండి నాయకుడో అందరికీ తెలుసు. ఎంతటి సమర్ధవంతమైన నాయకుడో ఆనాటి రాజకీయ సమాజానికి తెలుసు. పిడికెడు మంది కాంగ్రెస్‌లో సీమాంధ్ర తొత్తులైన తెలంగాణ ద్రోహులు తప్ప, కేసిఆర్‌ను విమర్శించేందుకు ఆనాడు కూడా ఎవరూ సాహసించలేదు. ఎందుకంటే కేసిఆర్‌ అనుకున్నది సాధిస్తాడు. సముద్ర మట్టానికి వెయ్యి అడుగులపైన వున్న సిద్దిపేటలో ఆనాడే గొంతు తడిపి, మంచినీటి సౌకర్యం కల్పించాడు. ఎందుకంటే ఒకనాడు సిద్దిపేటలో మంచి నీటి చుక్క కోసం విలవిలలాడిన సందర్భం. ఎమ్మెల్యే అయిన తర్వాత అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేసి, కేసిఆర్‌ అంటే ఏమిటో ఆ రోజుల్లోనే చూపించారు. ఆ తర్వాత జై తెలంగాణ అని నినదించిన నాడు తెలంగాణ మొత్తం ఆయనను నమ్మింది. ఎంత కాలం ఉద్యమం చేస్తారని ప్రశ్నిస్తే తెలంగాణ వచ్చేదాకా అంటూ ఒక దశలో కేసిఆర్‌ చెప్పిన సమాదానం తెలంగాణ ప్రజలు ఎంతగానో నచ్చింది. అందుకే అడుగడుగునా ఆయనకు తెలంగాణ సమాజం అండగా నిలిచింది. కేసిఆర్‌ మాత్రమే తెలంగాణ సాధిస్తాడని నమ్మింది. తెలంగాణ నమ్మినట్లే సాధించిన ఘనత కేసిఆర్‌ది. ఉద్యమ కాలంలోనే తెలంగాణ వస్తే ఎలా వుండాలో ఆలోచన చేసిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. అందుకే ఎడారి లాంటి తెలంగాణ ఎలా సస్యశ్యామలమౌతుందో కల గన్నాడు. ఆ కల నిజం చేశాడు. ఉమ్మడి పాలకులు తెలంగాణ సాగుకు నీళ్లు కష్టమన్నారు. ఇవ్వలేమన్నారు. ఇవ్వకుండా తెలంగాణ ఎండబెట్టారు. తెలంగాణను గోస పెట్టారు. అదే తెలంగాణను నేడు ముఖ్యమంత్రి కేసిఆర్‌ అన్న పూర్ణ చేశాడు. కరువు నెలలను పంట సిరులకు ఆలవాలం చేశాడు. ప్రాజెక్టులు అసాధ్యమన్న చోట మూడేళ్లలో కాలేశ్వరం పూర్తి చేసి, తెలంగాణ సస్యశ్యామలం చేశాడు. పాలమూరు, రంగారెడ్డి పూర్తి తెలంగాణను కోటిన్నర ఎకరాల మాగాణ చేశాడు. జలదృష్యంలో ఉద్యమ అడుగులు మొదలుపెట్టి, తెలంగాణను సుజల దృష్యం చేసి మన కళ్ల ముందు నిలిపాడు…దటీజ్‌ కేసిఆర్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *