
# తెలంగాణ సంపదను సృష్టించిన నేత కేసీఆర్
# మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి..
# ఘనంగా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు..
# కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం.
# రక్తదానంలో చురుగ్గా పాల్గొన్న 80 మంది యువకులు
నర్సంపేట,నేటిధాత్రి :
ఆంధ్ర పాలకుల నుండి చావునోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ సృష్టికర్త బి అర్ ఎస్ అధినేత కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో శనివారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభం చేశారు.
అనంతరం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో, ప్రజాప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు జరిపారు.ఈ సందర్భంగా కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర సృష్టికర్త, గమ్యాన్ని ముద్దాడే కార్యసాధకుడు అని అభివర్ణించారు.తెలంగాణ రాష్ట్రాన్ని ఎలాగైతే సృష్టించారో అదేస్థాయిలో రాష్ట్ర సంపదను కూడా సృష్టించి పేదలందరికి న్యాయం జరిగేలా చూసిన ఆలోచనకర్త కేసీఆర్ అని పేర్కొన్నారు.దశాబ్ది కాలంగా తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించిన గొప్ప నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఈ సందర్భంగా భగవంతుడిని కోరుకుంటున్నారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేసిన నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ తో పాటు ఆయన బృందానికి, ఐఎంఏ మాజీ అధ్యక్షులు లెక్కల విద్యాసాగర్ రెడ్డి అభినందించారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రక్తదానంలో నర్సంపేట ముందంజలో ఉందన్నారు.కరోనా లాంటి విపత్తుకరమైన సమయంలో కూడా నియోజకవర్గంలోని పలువురు యువకులు ముందుకొచ్చి రక్తాన్నిదానం చేశారని,అందులో సుమారు 8500 యూనిట్ల రక్తాన్ని సేకరించి ప్రభుత్వానికి అందించామని అన్నారు. రక్తదానం చేయడానికి స్వచ్చందగా ముందుకు వచ్చిన దాతలకు పెద్ది సుదర్శన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఓడిసిఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్ ,ఎంపిపిలు ప్రకాష్ రావు,జయమ్మ,కోమల,సునీత, జెడ్పిటిసిలు, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు, పట్టణ యూత్ అధ్యక్షులు, మాజీ ఎంపిపి, ఎంపిటిసిలు, సర్పంచ్ లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, గ్రామ , పట్టణ కమిటీ భాద్యులు, వార్డు సభ్యులు, క్లస్టర్ భాద్యులు, మహిళా సంఘాల నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.