జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదినోత్సవం, జమ్మికుంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మొలుగూరి సదయ్య జన్మదినోత్సవ వేడుకలను జమ్మికుంటలో ఘనంగా జరుపుకున్నారు. జమ్మికుంట శివాలయం బొమ్మల గుడిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొనగంటి రవీందర్ ఆధ్వర్యంలో బీదలకు, పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్వరరావు, సీనియర్ నాయకులు సాయినీ రవి, యూత్ నాయకులు సజ్జు, మాజీ పట్టణ ఉపాధ్యక్షుడు బుర్ర కుమార్ గౌడ్, రాచపల్లి రమేష్ , గుల్లి జపాన్, ఏబూసి ఓదెలు, దొగ్గల భాస్కర్, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు