*కాంగ్రెస్ పార్టీలోకి చేరిన కాటం సంజీవ్ .ముస్తాల తేజ*
*చేర్యాల నేటిధాత్రి*
చేర్యాల మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి పట్టణానికి చెందిన కాటం సంజీవ్ ముస్తాల తేజ జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ, మాజీ శాసనసభ్యులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా కాటం సంజీవ్ మరియు ముస్త్యల తేజ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించి మేము కాంగ్రెస్ పార్టీలో చేరామని అన్నారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి దాసరి అనసూయ (సీతక్క) గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

జనగామ నియోజకవర్గంలో జనగామ మరియు చేర్యాల మున్సిపాలిటీ మరియు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ పనులు, మౌలిక వసతుల కల్పనతో పాటు రాబోయే మున్సిపల్ ఎన్నికల వ్యూహాలు, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన కార్యాచరణ అంశాలపై విస్తృతంగా చర్చించారు.మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ,జనగామ మున్సిపాలిటీ మరియు చేర్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. గ్రామీణ ప్రాంతాలే కాదు, మున్సిపల్ పరిధిలోని సమస్యలను కూడా సమగ్రంగా పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల పక్షాన నిలిచే విధంగా పార్టీ వ్యూహాలు ఉండాలి” అని సూచించారు.
అలాగే త్వరలోనే జనగామ నియోజకవర్గాన్ని స్వయంగా సందర్శించి, అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని మంత్రి సీతక్క గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆడెపు చంద్రయ్య కొమ్ము నర్సింగరావు దాసరి శ్రీకాంత్ తాటికొండ సదానందం భూమి గారి మనోహర్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
