Student Leaders Submit Petition to Additional Collector
అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన విద్యార్థి సంఘా నాయకులు.
నల్లబెల్లి నేటి ధాత్రి:
మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను గురువారం తనిఖీలో భాగంగా వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి రాగా విషయం తెలుసుకున్న ఏ బి ఎస్ ఎఫ్, టిడివివి సంఘాల నాయకులు బట్టు సాంబయ్య, బోట్ల నరేష్ ఆధ్వర్యంలో గురుకుల వసతి గృహాల్లో నిలకొన్న పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టి, మైనార్టీ, సంక్షేమ గురుకుల వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులు చలి తీవ్రతో ఇబ్బంది పడుతున్నారని. చలి తీవ్రత నుండి విద్యార్థులకు విముక్తి కల్పించే విధంగా మండలంలోని గురుకుల పాఠశాల వసతి గృహాల్లో గ్రీజల్ ఏర్పాటు చేసే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని. అదేవిధంగా మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల కాంపౌండ్ చుట్టూ సోలార్ వైర్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని వారు కోరారు.
