ఏరియా జిఎం ఏ మనోహర్
మందమర్రి, నేటిధాత్రి:-
మందమర్రి ఏరియా కాసిపేట-2 ఇంక్లైన్ పని స్థలాలను బుధవారం ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాసిపేట ఉద్యోగుల భద్రత, సామర్థ్యం శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోని మైనింగ్ కార్యకలాపాలు వివిధ అంశాలను నిశితంగా అంచనా వేశారు. కాసిపేట-2 లో కొనసాగుతున్న చైర్ లిఫ్ట్ మ్యాన్ రైడింగ్ పనులను సమీక్షించారు, గనిలో పనిచేస్తున్న సిబ్బంది సౌలభ్యం భద్రతను మెరుగుపరచడానికి మ్యాన్ రైడింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మైనింగ్ కార్యకలాపాలు, భద్రత ఉత్పత్తి, ఇతర అంశాలు అత్యున్నతస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా వ్యూహాలు పరిష్కారాలను చర్చించారు. గనిలోని ఎయిర్ షాఫ్ట్ వెంటిలేషన్ ని పరిశీలించి వెంటిలేషన్‌ను మెరుగుపరచడానికి అధికారులకు సలహాలు సూచనలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ జే నాగరాజ్, గ్రూప్ ఏజెంట్ రాందాస్, గ్రూప్ ఇంజనీర్ రామ ప్రసాద్, మేనేజర్ జి లక్ష్మినారాయణ తదితరులు పాల్గోన్నారు.