
పెద్ద సంఖ్యలో హాజరైన మండల ప్రజలు .
ప్రతి ఏడాది నవంబర్ 9న ఉత్సవాల నిర్వహణ
శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలంలోని మైలారం గ్రామ శివారులోని కరిముల్లా సాబ్ దర్గా ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. మైలారం గ్రామంలోని మహమ్మద్ రఫీ ఇంటి నుండి జెండాను డప్పు చప్పుళ్ల మధ్య దర్గా వద్దకు తీసుకెళ్లారు. ముస్లిం మత పెద్ద అబ్దుల్లా నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఏడాది నవంబర్ 9న ఉత్సవాల నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షులు అక్బర్ పాషా తెలిపారు. దర్గా ప్రాంతంలో విద్యుత్ దీపాలు త్రాగునీటి సౌకర్యం లేకపోవడంతో జనరేటర్ సహాయంతో హైమాస్ లైట్లు మినరల్ వాటర్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి దర్గా వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు రఫీ యాకోబ్ పాషా అంకుస్ రహీం దావత్ ఇస్మాయిల్ గ్రామస్తులు పాల్గొన్నారు.